సౌత్ కొరియా విమాన ప్రమాదం.. 179 మంది దుర్మరణం..
TeluguStop.com
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాల సంఘటన రోజుకి ఎక్కువ అవుతుంది.ఈ అభిమాన సంఘటనలో అనేకమంది ప్రయాణికులు వారి ప్రాణాలను కోల్పోతున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా దక్షిణ కొరియాలో ( South Korea )ఒక విమాన దుర్ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు.స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జేజూ ఎయిర్ విమానం ( Jeju Air Flight )ముఅన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తున్నప్పుడు, ఆ విమానం రన్‌వే నుండి దూసుకెళ్తూ దుర్ఘటనకు గురైంది.
ఈ విమానంలో 175 ప్రయాణికులు, 6 ఫ్లైట్ అటెండెంట్లు ఉన్నారు.జేజూ ఎయిర్ బోయింగ్ 737-800 విమానం, థాయ్‌లాండ్ ( Thailand )నుండి తిరిగి దక్షిణ కొరియాకు వస్తూ, ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురయ్యింది.
"""/" /
ఈ ప్రమాదం కోసం ఒక కారణం పక్షి ఢీ కొట్టినట్లు సమాచారం.
దాని వల్ల విమానంలోని ల్యాండింగ్ గియర్ పగిలిపోయింది.ఈ కారణంగా, విమానంలో మంటలు వ్యాపించాయి.
అందిన నివేదిక ప్రకారం, పైలట్ ల్యాండింగ్ గియర్ వైఫల్యాన్ని గుర్తించిన తర్వాత, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు.
అయినప్పటికీ, విమానం రన్‌వే చివరికి చేరుకుని, అక్కడ బారికేడ్స్‌ను ఢీకొని మంటలు చెలరేగాయి.
175 మంది ప్రయాణికుల్లో 173 మంది దక్షిణ కొరియాకు చెందినవారే, మిగిలిన 2 మంది థాయ్‌లాండ్‌కు చెందినవారిగా తెలిపారు.
"""/" /
ఈ సమయంలో, కజకస్తాన్‌లో( Kazakhstan ) కూడా ఒక విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
అక్తౌ నగరానికి సమీపంలోని ప్రాంతంలో ఎంబ్రెయర్ జెట్ ప్రమాదానికి గురైంది.దీనిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
అలాగే, రష్యాలో కూడా ఒక విమాన ప్రమాదం సంభవించింది.దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణ కోరారు.
రెమ్యునరేషన్ ను మళ్లీ పెంచేసిన చిరంజీవి.. సీనియర్ హీరోల్లో ఈ హీరోదే రికార్డ్!