సిరియాలో 17 మంది సైనికులు మృతి..!!
TeluguStop.com

మధ్య ఆసియాలో ఉన్న దేశాల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయని సంగతి తెలిసిందే.


ఇజ్రాయిల్, పాలస్తీనా, ఇరాన్, ఇరాక్, లేబనన్ ఇంకా సిరియా దేశాలలో ఎప్పుడు బాంబులు మోత మోగుతూనే ఉంటుంది.


తాజాగా సిరియా రాజధాని డమాస్కస్ లో విషాదం చోటుచేసుకుంది.రాజధాని డమాస్కస్ లో మిలటరీ బస్ లో పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో సిరియా దేశానికి చెందిన 17 మంది సైనికులు మృతి చెందారు.
ఈ ఘటనకు పాల్పడింది ఎవరు అన్నదానిపై కారణాలు బయటికి రాలేదు.ఇప్పటివరకు ఏ సంస్థ కూడా తాము ఈ ఘటనకు పాల్పడినట్లు కారణం తామే అంటూ ప్రకటన కూడా చేయలేదు.
ఇటీవల సిరియా తిరుగుబాటుదారులు ఆక్రమించిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి.ఆ దేశ సైనికులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
జరుగుతున్న ఈ పోరులో సైనికులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.
దారుణం.. మురికి కాలువ నీటితో కూరగాయలు కడుగుతున్న వ్యాపారి… వీడియో చూస్తే గుండెలు గుభేల్!