17 గంటలు తీవ్ర ఉత్కంట…ఊపిరి పీల్చుకున్న అమెరికన్స్…!!

అమెరికాలోని లివర్మోర్ ఫాల్స్ లో జరిగిన ఓ సంఘటన స్థానిక అమెరికన్స్ ను భయబ్రాంతులకు గురిచేసింది.

ఓ వ్యక్తీ ముగ్గురు వ్యక్తులను ఓ ఇంట్లో భందించి భారీ పేలుడు పదార్ధాలతో బెదిరింపులకు పాల్పడటంతో చుట్టుపక్కల వారందరూ ఆందోళన చెందారు.

దాదాపు 17 గంటల పాటు తీవ్ర ఉత్కంటతో గుండెలు చేత్తో పట్టుకున్న అమెరికన్స్ ఊపిరి పీల్చుకునేలా బలగాలు ఎంట్రీ తో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.

ఇంతకీ అసలేం జరిగిందంటే.అమెరికాలోని మైనేలోని జే కు చెందిన డోనాల్డ్ వైట్ అనే వ్యక్తి తన మాజీ ప్రియురాలి ఇంట్లోకి చొరబడ్డాడు.

ఆమెతో పాటు అక్కడ ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని భందీలుగా చేశాడు.

తన వద్ద భారీ పేలుడు పదార్ధాలు ఉన్నాయని,తమ వద్దకు ఎవరైనా వస్తే పెల్చేస్తానని, చుట్టుపక్కల ఎవరూ మిగిలే అవకాశమే లేదని ప్రకటించాడు.

దాంతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ ఆందోళన చెందారు.ఈ విషయం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతానికి వచ్చి క్షుణ్ణంగా పరిశీలించాయి.

పరిస్థితులను అంచనా వేసిన బాగాలు అతడికి హెచ్చరికలు జారీ చేశాయి.డోనాల్డ్ వైట్ ను లొంగిపోవాలని, తనను ఏమీ చేయమని హామీ కూడా ఇచ్చాయి.

ఇలా 17 గంటల పాటు బలగాలు, డోనాల్డ్ వైట్ మధ్య చర్చలు జరిగినా అతడు మొండి పట్టుపట్టాడు.

బలగాలపై కాల్పులు చేయడం మొదలు పెట్టాడు.దాంతో పేలుడు పదార్ధాలు అతడి వద్ద భారీగా ఉన్నాయని భావించిన సైనికులు, వ్యూహాత్మకంగా అతడిపై దాడి చేశాయి.

తప్పనిసరి పరిస్థితులలో కాల్పులు జరిపాయి.కానీ సైనికుల చేతిలోచనిపోవడం ఇష్టంలేదని తనకు తానుగా చనిపోతానని చెప్పి మరీ అతడు తుపాకితో కాల్చుకుని చనిపోయాడని మాజీ ప్రియురాలు తెలిపింది.

బాంబ్ స్క్వాడ్ తో బలగాలు తనికీలు చేయగా ఇంట్లో భారీ పేలుడు పదార్దాలు ఉన్నట్లుగా గుర్తించారు.

దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఖలిస్తాన్ మద్ధతుదారులకు కెనడా కోర్ట్ షాక్ .. పోలీసులకు కీలక ఆదేశాలు