ఆ సినిమా టార్గెట్ 16 వేల కోట్లు..!

జేమ్స్ కామెరూన్ నుంచి వస్తున్న మరో అద్భుత సృష్టి అవతార్ 2.అవతార్ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఆ సినిమాని బీట్ చేసేలా మరో సినిమా రాలేదు.

విజువల్ వండర్ లా అనిపించే అవతార్ మూవీ సీక్వల్ గా అవతార్ 2 వస్తుంది.

ఈ మూవీ డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ భారీ టార్గెట్ ని పెట్టుకుంది.

వరల్డ్ వైడ్ గా అవతార్ 2 16 వేల కోట్ల టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది.

ప్రపంచ సినీ చరిత్రలోనే ఇదొక సంచలనం అని చెప్పొచ్చు.ఈ మూవీపై ఇండియాలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.

తెలుగులో కూడా మూవీ వందల కోట్ల బిజినెస్ చేస్తుందని తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా ఈ మూవీ బిజినెస్ తో పాటుగా వసూళ్లు కూడా అదరగొడతాయని చెప్పొచ్చు.

అవతార్ 2 ట్రైలర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది ప్రూవ్ చేసిన కామెరూన్ వెండితెర మీద మరోసారి తన అద్భుతాన్ని ఆవిష్కరించనున్నాడు.

అవతార్ 2 వరల్డ్ స్క్రీన్ మీద ప్రభంజనం సృష్టించాలని చూస్తుంది. మరి అవతార్ 2 ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

కర్నూలు జిల్లా ఆలూరు సభలో సీఎం జగన్ పై చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!