ఏకంగా 1600 షాట్స్..’బాహుబలి’ ని మించిన ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’

ఒక కంటెంట్ తో ప్రేక్షకులకు అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని కలిగించాలంటే భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణం ఉండాల్సిన అవససరమే లేదు.

డైరెక్టర్ ( Director )తెలివి తో తక్కువ బడ్జెట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించొచ్చు అని రీసెంట్ గా విడుదలైన ఎన్నో సినిమాలు నిరూపించాయి.

అందుకు బెస్ట్ ఉదాహరణ 'కాంతారా'( Kanthara Movie ) చిత్రం.కేవలం 10 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకి తెలుగు , కన్నడ , హిందీ , మలయాళం బాషల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

కంటెంట్ బాగుంటే ఒక సినిమాని నెత్తిన పెట్టుకొని చూసుకుంటాము అని ఆడియన్స్ ఇలాంటి ఉదాహారణలతో చెప్పకంటే చెప్తున్నారు.

అలా ప్రముఖ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) తెరకెక్కించిన 'హనుమాన్'( Hanuman ) అనే చిత్రం కూడా ఆడియన్స్ లో దృష్టిని ఒక రేంజ్ లో ఆకర్షించింది.

ఇంత తక్కువ బడ్జెట్ తో బాహుబలి సినిమా రేంజ్ క్వాలిటీ ఔట్పుట్ ఎలా సాధ్యపడింది అంటూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది ఈ సినిమా టీజర్.

"""/" / ఈ టీజర్ లోని విజువల్స్ చూసిన తర్వాత ఈ చిత్రానికి బడ్జెట్ కేవలం 15 కోట్ల రూపాయిలు అంటే ఎవ్వరూ నమ్మలేరు.

అంత అద్భుతంగా ఉన్నాయ్ విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం కూడా.అయితే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం వర్క్ జూన్ నెలలో పూర్తి అవుతుందని, ఆ తర్వాత గ్రాఫిక్స్ వర్క్ కోసం సుమారుగా నెల రోజులపైనా సమయం కేటాయిస్తున్నామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.

ఈ చిత్రం లో మొత్తం 1600 VFX షాట్స్ ఉంటాయట.ఆ షాట్స్ అన్నీ ఇప్పటికే ఒక ప్రముఖ VFX కంపెనీ కి పంపేసారట.

ప్రతీ షాట్ అద్భుతంగా వచ్చేలా ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ తెలిపాడు.

ఇక ఈ చిత్రం లో తేజ సజ్జల హీరో గా నటిస్తుండగా, అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.

వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.

"""/" / ప్రశాంత్ వర్మ ఇది వరకు 'అ.!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' మరియు 'అద్భుతం' వంటి సినిమాలు తీసాడు.

బాక్స్ ఆఫీస్ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది కాసేపు పక్కన పెడితే, ప్రతీ చిత్రం కూడా దేనికి దానికి ప్రత్యేకం అన్నట్టుగా ఉంటాయి.

ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతిని కలిగించేలా చేసాయి ఈయన తీసిన చిత్రాలు.

ఇంత మంచి టాలెంట్ ఉన్న ఈ కుర్రాడికి కచ్చితంగా ఈ 'హనుమాన్' అనే చిత్రం కెరీర్ కి బిగ్గెస్ట్ యూ టర్న్ గా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈ సినిమా తర్వాత ఆయన డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ తో అధీరా అనే చిత్రం చేస్తున్నాడు.

వీటితో పాటుగా ఆయన త్వరలోనే నందమూరి బాలకృష్ణ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు.

రీసెంట్ గానే ఆయనని కలిసి స్టోరీ చెప్పానని, బాలయ్య అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడని, కాకపోతే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి అయ్యాకనే ఈ చిత్రం మొదలు అవుతుందని చెప్పాడు.

సంచలన నిర్ణయం తీసుకున్న ఉపాసన రాంచరణ్.. పిఠాపురంలో అపోలో హాస్పిటల్!