రాష్ట్రంలో కొత్తగా 1,506 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతుంది.గడిచిన వారం రోజులుగా నిలకడగా కేసులు నమోదవుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం 9:00 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65,500 సేకరించి పరీక్షించగా వాటిలో 1,506 పాజిటివ్ కేసులు నమోదైనట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా కరోనాకు చికిత్స పొందుతూ 16 మంది మరణించారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 17,865 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు పరిశీలిస్తే.అధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 319, చిత్తూరు జిల్లాలో 217 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు వెలుగు చూశాయి.

నెల్లూరు జిల్లాలో 181, పశ్చిమగోదావరి జిల్లాలో 170, గుంటూరు జిల్లాలో 162, ప్రకాశం జిల్లాలో 102 కృష్ణా జిల్లాలో 98, విశాఖపట్నం జిల్లాలో 75, విజయనగరం జిల్లాలో 72, శ్రీకాకుళం జిల్లాలో 45, వైఎస్ఆర్ కడప లో 27 అనంతపురం జిల్లాలో 23 కేసులు కొత్తగా బయటపడ్డాయి.

కోవిడ్ చికిత్స పొందుతూ చిత్తూరు.కృష్ణా జిల్లాలో నలుగురు చొప్పున తూర్పుగోదావరి.

విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున గుంటూరు.నెల్లూరు.

శ్రీకాకుళం.పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13,647 మంది కోవిడ్ కు బలయ్యారు.వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,56,61,449 శాంపిల్స్ సేకరించి పరీక్షించగా అందులో 19,93,697 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

వారిలో ఇప్పటివరకు 19,62,185 కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకుని సాధారణ జీవితం గడుపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 1,835 మంది కరోనా నుంచి విముక్తి పొంది డిశ్చార్జి అయ్యారు.

Vijay Devarakonda Rashmika : ఫ్యామిలీస్టార్ లో హీరోయిన్ గా రష్మిక చేసి ఉంటే బాగుండేది.. ఈ ఇద్దరి కెమిస్ట్రీ వేరే లెవెల్ అంటూ?