చిన్నారి వైద్యం కోసం 15వేల రూపాయలు అందజేత -మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా: కరీంనగరుకు చెందిన గౌతం పవన్ కుమార్ సుప్రియ దంపతుల ఒకగానొక్క పాప అనారోగ్యంతో భాదపడుతుండడంతో హాస్పిటల్ వెళ్లి చూపించగా లివర్ ప్రాబ్లమ్ ఉంది అని, లివర్ ట్రాస్పీలేషన్ చేయాల్సి వస్తుంది, దీనికి లక్షల్లో ఖర్చు అవుతుంది అని డాక్టర్లు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఏదైనా దయతో మీకు తోచిన ఆర్థిక సాయం అందించండి అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యుల ద్వారా సమాచారం అందించడంతో సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులలో పోస్టు చేయగా దాతలు మనవతా దృక్పదంతో స్పందించి దాదాపు 15వేల రూపాయలు విరాళంగా అందించారు.

పాప మరియూ వారి తల్లిదండ్రులు హైదరాబాద్ హాస్పిటల్ నందు ఉండి వారు రాలేని పరిస్థితుల్లో వారి ఇంటి పక్కవారిని పంపించడంతో సోమ వారం రోజున వారికి 15వేల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది.

ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు తోచిన విరాళం ట్రస్టు అకౌంటు నం.

89855 88060కు అందిస్తే ట్రస్టు చిన్నారి పాప ఆరోగ్యం గురించి వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరుగుతుందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు.

ఇట్టి కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు మధు మహేష్, గొంగళ్ల రవికుమార్, డాక్టర్.బెజ్జంకి రవీందర్, చల్లా సత్తయ్య, పొలాస రాజేందర్, ప్రతాప నటరాజు, పొలాస రాజేందర్, పాత సంతోష్, వీరగొని ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

టాలీవుడ్ లో నాని.. కోలీవుడ్ లో శివకార్తికేయన్.. కథల ఎంపికలో ఈ హీరోలు వేరే లెవెల్!