మునుగోడు ఉపఎన్నికలో నేడు 15 మంది నామినేషన్లు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలే కాకుండా పలు నామినేషన్లు దాఖలు అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఇవాళ 15 మంది నామినేషన్లు దాఖలు చేశారు.ఇప్పటివరకు 32 మంది అభ్యర్థులు 52 సెట్ల నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కాగా ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.మరోవైపు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏలు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తామని తెలిపారు.

ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోకి బ్రేక్ పడనుందా..? బాలయ్య దృష్టి అంతా ఆ దర్శకుడి మీద ఉందా..?