మన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమైన చీరకట్టు ఆడవారి సొగసులను మరింత అందంగా చూపిస్తుంది.
మరి అలాంటి చీరకట్టు ఈ తరం అమ్మాయిల లో సగం మందికి పైగా ఎలా కట్టుకోవాలో తెలియదు.
ఆధునీకరణ ఎఫెక్ట్ వల్ల మన సంప్రదాయాలన్నీ మంటగలుస్తున్నాయని దాని ఫలితంగానే ఈతరం అమ్మాయిలకు చీర కట్టుకోవడం అసలు రావట్లేదు అని ఒకవేళ కట్టుకున్న అన్ కంఫర్టబుల్ గా ఫీలవుతున్నారని కొందరు పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి టైంలో చీర కట్టుకోవడమే కాకుండా ఏకంగా చీరలో జిమ్నాస్టిక్స్ చేసి ఒక బాలిక అందరి మతులు పోగొట్టింది.
ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.హరియాణా రాష్ట్రంలోని అంబాలాకు చెందిన 14 ఏళ్ల పారుల్ జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతోంది.
అయితే తాజాగా చీర కట్టిన పారుల్ చీరలో జిమ్నాస్టిక్ విన్యాసాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అంతటితో ఆగకుండా
సల్వార్ కమీజ్, స్కర్ట్, గౌను, పంచె డ్రెస్ లు ధరించి జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఇప్పుడు ఆ వీడియో లు తెగ వైరల్ అవుతున్నాయి.మీరు కూడా ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.
మేమేం టెర్రరిస్టులం కాదు దయచేసి అలా చేయొద్దు… సీరియస్ అయిన నాని!