28 పోలీస్ శిక్షణా కేంద్రాల్లో 14,881 మందికి శిక్షణ: డీజీపీ
TeluguStop.com
పోలీస్ శాఖ( Police Department )లో ఎస్సై, కానిస్టేబుల్ స్థాయిలో ఆయా విభాగాల్లో కొత్తగా నియామకం కానున్న 14,881 మందికి రాష్ట్రవ్యాప్తంగా 28 శిక్షణాకేంద్రాల్లో శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు.
శిక్షణాకేంద్రాల్లో ఏర్పాట్లపై శిక్షణావిభాగం ఐజీ తరుణ్ జోషి( IG Tarun Joshi )తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ శిక్షణాకళాశాలల ప్రిన్సిపాళ్లతో డీజీపీ తన కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు, అక్టోబరు నుంచి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
శిక్షణా తరగతులు ప్రారంభం కావడానికి ముందుగానే పీటీసీల్లో మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణకు కావాల్సిన పరికరాలు, వసతి సౌకర్యం ఇతర అన్నింటిని ఏర్పాటు చేసుకోవాలని, మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
అందంగా పుట్టడమే ఈ మోడల్ తప్పయింది.. ఫ్రెండ్స్ ఏం చేశారో తెలిస్తే..