గురువుకు 14వేల ఆర్థిక సహాయం అందజేత – పూర్వ విద్యార్థుల ఆత్మీయత

రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్యంలో విద్య నేర్పిన గురువు కుటుంబం కటుక పేదరికంతో నివసిస్తున్న సమాచారాన్ని తెలుసుకొని పూర్వ విద్యార్థులు 14 వేల ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందజేసి మానవీయతను చాటుకున్నారు.

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు గత రెండు దశాబ్దాల క్రితం ఒక ప్రైవేటు బడిలో ఉపాధ్యాయునిగా పని చేశాడు.

అనంతరం బ్రతుకుతెరువు నిమిత్తం హైదరాబాద్ కు వలస వెళ్లాడు వేణు తల్లి విజయమ్మ అనారోగ్య బారిన పడడంతో తల్లిని బ్రతికించుకుందామని స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేటకు చేరుకొని తల్లి బాగోవులు చూసుకుంటున్నాడు.

అప్పుడు విద్యనభ్యసించిన 2001 వ సంవత్సరం పూర్వ విద్యార్థులు కొత్త వేణు రెడ్డి, శ్రీధర్ మందాటి, శ్రీధర్ మందాటి రామచంద్రం, తిరుపతి,వెంకటేష్ గంట, జితేందర్, పోతు ప్రవీణ్, రవీందర్ రెడ్డి నవీన్ అజయ్, ఆశీర్వాదం, పరశురాములు, అంజయ్య, బాలయ్య లు డబ్బులు పోగు చేసి తమ నివాసానికి వెళ్లి పరామర్శించి భరోసాను కల్పిస్తూ అందజేశారు.

పొరపాటున రూ.1.5 కోట్లు శాలరీగా జమ చేసిన కంపెనీ.. అవి తీసుకుని ఉద్యోగి జంప్..??