వేములవాడ ప్రాంతీయ దవఖానకు అరుదైన ఘనత ఓకే నెలలో 140 డెలివరీలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) వేములవాడ ప్రాంతీయ దవఖాన ప్రారంభమైనప్పటినుండి వందకు పైగా చేయడం రెండవ సారీ.

ఈ మే నెలలో 140 డెలివరీలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, డెలివరీలో పాల్గొన్న వైద్య బృందాన్ని, సిబ్బందిని మెడికల్ సూపరింటెండెంట్ ఆర్ మహేష్ రావు( R Mahesh Rao ) గారు వారిని అభినందిస్తూ, అందరూ సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిది ఏది లేదన్నారు.

ఎప్పుడు కూడా నాది అనుకుని పని చేయాలని సూచించారు.అలాగే దవాఖాన సేవలను( Hospital ) అందరూ వినియోగించుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు చైతన్య సుధా, తిరుపతి, సంతోష్ చారి, అనిల్ కుమార్, దీప్తి, వెంకటభరణి, రత్నమాల, జ్యోతి, నవీన్, అలేఖ్య, ప్రణతి రెడ్డి, పరమేశ్వరి, బిందు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ అభినందనఈ మే నెలలో వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 140 డెలివరీలు చేయడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.

ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేష్, వైద్యులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు.

సొరచేపతో జూనియర్ ఎన్టీఆర్ ఫైట్.. ఆ సినిమాను మించేలా సీన్స్ ఉండనున్నాయా?