జిల్లాలో 140 కోట్ల రైతుబంధు బకాయిలు:కోమటిరెడ్డి

యాదాద్రి జిల్లా:జిల్లా సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ) కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు జరిగే పథకముల తీరుపై సమీక్ష సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 140 కోట్ల రైతుబంధు బకాయిలు ఉన్నాయని,ధాన్యం కొనుగోలులో 30 % డబ్బులు చెల్లించాల్సి ఉన్నదని వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం నిధులతో నిర్మించిన పనులలో నాణ్యతల్లేకుండా జరిగాయని, వీటిపైన పార్లమెంటరీ కమిటీలో స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలో అన్ని పనులపైన కేంద్ర విజిలెన్స్ కు ఫిర్యాదు చేస్తానని,పనుల నాణ్యత విషయంలో సరైన విధంగా పట్టించుకోకపోతే ఇబ్బందుల పాలవుతారని కలెక్టర్ తో పాటు మిగిలిన అధికారులను హెచ్చరించారు.

పుష్ప ది రూల్ మూవీలో శ్రీలీలకు ఛాన్స్.. జానీకి బదులుగా ఆ కొరియోగ్రాఫర్ కు ఛాన్స్ దక్కిందా?