వావి వరుసలు మరచి కామంతో కళ్లు మూసుకుపోయి చెల్లెలి పైనే…
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావివరుసలు మరచి ప్రవర్తిస్తుండడంతో ఆడపిల్లలు సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో అనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు.
తాజాగా ఓ యువకుడు తనకు చెల్లెలి వరుసయ్యేటువంటి ఏడవ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి ఆమెను ఏకంగా గర్భవతిని చేసిన ఘటన దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే 14 సంవత్సరాలు కలిగినటువంటి ఓ బాలిక తన తల్లిదండ్రులతో కలిసి స్థానిక రాష్ట్రంలోని లూధియానా ప్రాంతంలో నివాసం ఉంటుంది.
అయితే ఈ బాలిక స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో ఏడవ తరగతి చదువుకుంటోంది.
దీంతో రోజూ పాఠశాలకి ఇంటి నుంచే వెళ్లి వస్తూ ఉండేది.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటుంది.
అయితే ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మరో యువకుడు అభం శుభం తెలియని బాలికపై కన్నేశాడు.
ఈ క్రమంలో ఎలాగైనా బాలికను అనుభవించాలని పలు ప్రయత్నాలు చేశాడు.అయితే ఇటీవలే బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.
దీంతో ఇదే అదునుగా భావించినటువంటి యువకుడు వెంటనే బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
అంతేగాక ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.ఇలా బాలిక ఒంటరిగా ఉన్న పలుమార్లు బెదిరించి ఆమెపై అత్యాచారం చేసేవాడు.
అయితే తాజాగా బాలికకు కడుపులో నొప్పి రావడంతో బాలిక తల్లి వెంటనే బాలికను ఆసుపత్రికి తీసుకెళ్ళింది.
వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు బాలిక 4 నెలల గర్భవతి అని చెప్పడంతో ఒక్కసారిగా బాలిక తల్లిదండ్రులు ఖంగు తిన్నారు.
దీంతో తన గర్భానికి కారణమేంటని నిలదీయడంతో బాలిక తనపై జరిగినటువంటి అఘాయిత్యం గురించి తన తల్లిదండ్రులతో చెప్పి బోరున విలపించింది.
విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి యువకుడిపై ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.
బన్నీ అరెస్ట్ దేనికి సంకేతం.. సెలబ్రిటీలు జాగ్రత్తగా ఉండకపోతే చుక్కలే!