అమెరికా : షాపింగ్‌లో తల్లి .. కారులో పిల్లలు, అనుకోకుండా తమ్ముడిని కాల్చేసిన బాలుడు
TeluguStop.com
అమెరికాలో గన్ కల్చర్( Gun Culture In America ) కారణంగా జరిగే దారుణాలకు అంతులేకుండా పోతోంది.
ప్రతియేటా వేలాది మంది అమాయకులు ఉన్మాదుల తూటాలకు బలవుతున్నారు.తాజాగా ఓక్లహొమాలో ( Oklahoma )దారుణం జరిగింది.
14 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ తన 8 ఏళ్ల సోదరుడిని కాల్పిచంపాడు.చోక్టావ్‌లోని వాల్‌మార్ట్ పార్కింగ్ ప్లేస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది.
వీరి తల్లి లోపల షాపింగ్ చేస్తుండగా.వీరిద్దరూ కారులో కూర్చొని వుండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
"""/" /
చోక్టావ్ పోలీస్ చీఫ్ కెల్లీ మార్షల్( Kelly Marshall ) ప్రకారం.
అన్నయ్య తుపాకీని తీసుకుని ఆడుకుంటూ వుండగా, అప్పటికే అది లోడ్ చేసి వుండటంతో ప్రమాదవశాత్తూ అతని తమ్ముడిని కాల్చాడు.
తుపాకీ పేలుడు శబ్ధం వినిపించడంతో స్థానికులు అత్యవసర సహాయం కోసం 911కి కాల్ చేశారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.చిన్నారికి అక్కడికక్కడే అత్యవసర సహాయాన్ని అందించారు.
అనంతరం బాలుడిని అంబులెన్స్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఓక్లహోమా ట్రామా సెంటర్‌కు( University Of Oklahoma Trauma Center ) తరలించారు.
ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే వుందని చెబుతున్నప్పటికీ, చిన్నారికి శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చని అధికారులు చెబుతున్నారు.
"""/" /
ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని చీఫ్ మార్షల్ ప్రజలకు తెలిపారు.
పెద్దలు తుపాకీ నిర్వహణను సరిగా చేపట్టలేదని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.ముఖ్యంగా ఇంట్లో చిన్నారులు వున్నప్పుడు వారి భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా వుండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరో ఘటనలో ఫిలడెల్ఫియాలో( Philadelphia ) సోమవారం రాత్రి నగర వీధుల్లో ఉన్మాది పిచ్చెక్కినట్లుగా కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని వెంటాడి పట్టుకున్నారు .అతని వద్ద నుంచి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఏఆర్ రకం రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్‌లో నకిలీ డాలర్ల రాకెట్ గుట్టురట్టు .. నిందితుల్లో ఓ ఆస్ట్రేలియా పౌరుడు