ఇండోనేషియాలో అగ్నిప్రమాదం 14 మంది సజీవ దహనం..!!

ప్రపంచవ్యాప్తంగా భయానక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.మహమ్మారి కరోనా తీసుకొచ్చిన కష్టాలకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయి.

మరోపక్క రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.

ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉంటే ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు.పూర్తి విషయంలోకి వెళ్తే ఇండోనేషియా ఈస్ట్ నుసా టెంగర్రా ప్రావిన్స్ లో ఓ ఓడలో అగ్ని ప్రమాదం జరిగి 14 మంది సజీవ దాహానమయ్యారు.

దీంతో సముద్రంలో చిక్కుకున్న 226 మందిని రెస్క్యూ టీం కాపాడటం జరిగింది.అయితే ఓడలో అకస్మాత్తుగా మంటలు ఎలా వ్యాపించాయి అన్నది ఎవరికి అర్థం కాకపోవటంతో అధికారులు ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయటానికి రెడీ అయ్యారు.

అంతకుముందు ఇదే ప్రాంతంలో ఈ రకంగానే ఓడ ప్రమాదాలు జరిగాయి.1991లో జరిగిన ప్రమాదంలో 300 మందికి పైగానే చనిపోయారు.

ఆ తర్వాత 2018 వ సంవత్సరంలో జరిగిన ప్రమాదంలో 167 మంది జలసమాధి అయ్యారు.

తన కొడుకుల సినీ ఎంట్రీ గురించి ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు.. అలా చెప్పడంతో?