ధూళిపాళ్ల నుంచి 13వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
TeluguStop.com
ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’( Memantha Siddham ) బస్సు యాత్ర 13వ రోజుకు చేరుకుంది.
ఇందులో భాగంగా ధూళిపాళ్ల( Dhulipalla ) నుంచి ప్రారంభమైన నేటి యాత్ర సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డుకు చేరుకోనుంది.
అక్కడ సీఎం జగన్( AP CM YS Jagan ) భోజన విరామం తీసుకోనున్నారు.
తరువాత చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్డు మీదుగా ఎటుకురు బైపాస్ కు చేరుకోనున్నారు.
అక్కడ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.సభ ముగిసిన తరువాత బుడుంపాడు బైపాస్, తక్కేలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్ మీదుగా నంబూరు బైపాస్( Namburu Bypass ) వద్ద బస్సు యాత్ర చేరుకోనుంది.
ఈ క్రమంలో సీఎం జగన్ నంబూరు బైపాస్ వద్ద రాత్రి బస చేయనున్నారు.
కాగా మేమంతా బస్సు యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంది.
స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఫోన్ చేసిన బాలయ్య.. అసలేం జరిగిందంటే?