13 ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడి ఆటో డ్రైవర్ తో జంప్... చివరికి...
TeluguStop.com
ప్రస్తుత కాలంలో కొందరు మైనర్ బాలికలు తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజాగా ఓ 13 ఏళ్ల ఓ బాలిక ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడి పరారైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందిన ఇటువంటి త్రిపురాంతకం అనే గ్రామంలో ఓ 13 ఏళ్ల కలిగినటువంటి బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.
ఈ బాలిక స్థానికంగా ఉన్నటువంటి ఓ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతోంది.అయితే ఈ బాలిక స్థానికంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ తో ప్రేమలో పడింది.
దీంతో బాలిక ఎప్పుడూ అతడితో సెల్ ఫోన్లో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ చదువుపై అశ్రద్ధ వహించింది.
ఇది గమనించినటువంటి బాలిక తల్లిదండ్రులు ఆమెను మందలించారు.అయినప్పటికీ బాలిక తీరు మారక పోవడంతో ఇదే జిల్లాలో ఉన్నటువంటి తన మేనత్త ఇంటి వద్దకు బాలిక తల్లిదండ్రులు పంపించారు.
"""/"/
దీంతో బాలిక తన మేనత్త వద్దనే ఉండి చదువుకుంటోంది.అయితే కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ తన ప్రియుడితో మాట్లాడడం చాటింగ్ చేయడం వంటివి చేసింది.
ఇందులో భాగంగా తాను తన మేనత్తతో ఉండలేకపోతున్నానని వెంటనే తనను తీసుకెళ్లమని తన ప్రియుడికి చెప్పింది.
దీంతో ఆమె ప్రియుడు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను తన వెంట పెట్టుకొని పరారయ్యాడు.
విషయం తెలుసుకున్నబాలిక మేనత్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు రంగంలోకి దిగి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రేమజంట ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం బాలిక కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి ఇంటికి పంపించారు.
చందు మొండేటి స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే ఇదొక్కటే దారి…