ఒక బాల్ కి 13 రన్స్.. న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ స్టాంట్నర్ మెరుపు ఇన్నింగ్స్..!

క్రికెట్ లో ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో.మ్యాచ్ ఎప్పుడు మలుపు తిరుగుతుందో అస్సలు ఊహించలేం.

అప్పుడప్పుడు అరుదుగా క్రియేట్ అయ్యే రికార్డులు చరిత్రలో నిలిచిపోతాయి.భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) వైపు ప్రపంచం అంతా చూస్తోంది.

టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు తమ జట్లను గెలిపించడంతోపాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా సోమవారం జరిగిన న్యూజిలాండ్- నెదర్లాండ్స్ ( New Zealand- Netherlands )మ్యాచ్ చివర్లో మిచెల్ స్టాంట్నర్ ఓ అద్భుతమైన ఫీట్ సాధించాడు.

కేవలం ఇన్నింగ్స్ చివరి బంతి కి ఏకంగా 13 పరుగులు చేసి ఓసారి కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

"""/" / న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చివరి బంతికి స్టాంట్నర్ క్రీజులో స్ట్రైక్ ఉన్నాడు.

డి లీడే ఫుల్ టాస్ వేయగా.స్టాంట్నర్ సిక్స్ కొట్టాడు.

ఇక ఇన్నింగ్స్ పూర్తయిందని అందరూ అనుకునే లోపే అంపైర్ అందరికీ షాక్ ఇచ్చాడు.

చివరి బంతిని నోబాల్ గా ప్రకటించాడు.దీంతో మళ్లీ స్టాంట్నర్ స్ట్రైక్ లో నిలుచున్నాడు.

మళ్లీ చెలరేగి మరో సిక్స్ కొట్టాడు.దీంతో ఇన్నింగ్స్ చివరి బంతికి రెండు సిక్సులు అంటే 12 పరుగులు, నోబాల్ కావడంతో ఒక పరుగు మొత్తం కలిపి ఒక బంతికి 13 పరుగులు వచ్చాయి.

స్టాంట్నర్ 17 బంతుల్లో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోను తన సత్తా ఏంటో చూపించాడు.

స్టాంట్నర్ 59 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను పడగొట్టాడు.న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ప్రపంచ కప్ లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్ గా న్యూజిలాండ్ స్పిన్నర్ స్టాంట్నర్ నిలిచాడు.

నెదర్లాండ్ పై 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

మందారం అలంకరణకు మాత్రమే కాదు వెయిట్ లాస్ కు సహాయపడుతుంది.. తెలుసా?