పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు దుర్మరణం.. !
TeluguStop.com
నేడు మనుషుల ప్రాణాలు పోవడం అనేది యముడి చేతుల్లో కంటే ఇతరుల చేతుల్లో ఉంటుంది.
ఇలా వారి నిర్లక్ష్యం వల్లనో ఇంకా కొంత కాలం బ్రతకవలసి ఉన్న అర్దాంతరంగా మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది.
ఇప్పటికే కరోనా వల్ల ఊహించని విధంగా మరణాలు చోటు చేసుకుంటుండగా, మరో వైపు అగ్ని ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతూనే ఉంది.
ఎవరి తప్పిదం అయితే ఏంటి ఈ ప్రమాదల వల్ల కుటుంబాలకు కుటుంబాలు అనాధల్లా మారి రోడ్డున పడుతున్నాయి.
ఇకపోతే పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన ఘటన చోటు చేసుకుంది.
ఆ వివరాలు చూస్తే.పంజాబ్ ప్రావిన్సులోని అట్టోక్ జిల్లా హసన్ అబ్దల్ ఏరియా బుర్హాన్ ఇంటర్ ఛేంజ్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడటం తో 13 మంది ప్రయాణికులు మరణించగా 25 మంది గాయపడ్డట్టు సమాచారం.
ఇక ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది.
వేపాకుతో ఇలా చేశారంటే వద్దన్నా మీ జుట్టు విపరీతంగా పెరుగుతుంది!