12 ఏళ్ల వయస్సులోనే ఆ బిజినెస్ తో లక్షల్లో సంపాదిస్తున్న చిన్నారి.. గ్రేట్ అంటూ?

మామూలుగా 12 ఏళ్ల వయసు పిల్లలు ఆ సమయంలో ఏం చేస్తుంటారు అంటే మహా అయితే చదువుకోవడం ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు.

అలాంటిది ఒక 12 ఏళ్ల చిన్నారి ఏకంగా బిజినెస్ లు చేస్తూ చిన్నారి వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకుంది.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం.ఇంతకీ ఆ చిన్నారి ఎవరు ఆ చిన్నారి ఎలాంటి ఘనతను సాధించింది అన్న వివరాల్లోకి వెళితే.

చిన్నారి వ్యాపారవేత్త పేరు కేశిక( Keshika )ఆమె ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలో లాక్ డౌన్ రావడంతో ఏం చేయాలో తెలియక ఎటు వెళ్ళాలో పాలు పోక కాలక్షేపం అవ్వడానికి ఏదైనా చేయాలని అనుకుంది.

అలాంటి సమయంలో ఆన్లైన్లో బేకింగ్ వీడియోలో ఆకర్షించడంతో సరదాగా వంటలు నేర్చుకుంది.అలా ఆ లాక్ డౌన్ సమయంలోనే ఊరగాయల నుంచి కేకుల వరకు చాలా ఐటెం లను తయారు చేయడం నేర్చుకుంది.

అలా ఆమె ప్రతిభ చూసి ఆమె అక్క సొంతంగా బ్రాండ్ పెట్టవచ్చు కదా అని సలహా ఇవ్వడంతో కేస్ కిచెన్ అనే ఒక వ్యాపారాన్ని ప్రారంభించింది కేశిక.

అయితే ఆ వ్యాపారం మొదలు పెట్టినప్పటికీ ఆమె వయసు 12 సంవత్సరాలు మాత్రమే.

ఆమెది చెన్నై.నైపుణ్యం పెంచుకోవడానికని బేకింగ్‌లో మాస్టర్స్‌నీ పూర్తిచేసింది.

ఒక వైపు చదువుతూనే వ్యాపారం నిర్వహించింది.తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి పుట్టినరోజులు, పెళ్లిళ్లకు కేకులు చేసిచ్చే స్థాయికి చేరింది.

అలా కొద్దికాలంలోనే తన బ్రాండ్‌కి చెన్నైలో గుర్తింపు తెచ్చుకుంది.అంతా బాగా సాగుతోంటే తరగతులు ప్రారంభమయ్యాయి.

అయినా కూడా వెనుకడుగు వేయకుండా ఒకవైపు స్కూల్ కి వెళుతూనే తన బ్రాండ్ ని కాపాడుతూ వ్యాపారాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది.

"""/" / మధ్యలో స్కూల్ కి వెళ్తున్నప్పుడు బ్రాండ్ నిర్వహణ కష్టమవడంతో రెండు నెలలు వ్యాపారాన్ని పక్కన పెట్టింది.

ఆ సమయంలో రెండింటినీ న్యాయం చేసుకునే మార్గం ఓపెన్ స్కూలింగ్ రూపంలో దొరకడంతో అటువైపు అడుగులు వేసింది.

యంగ్‌ అచీవర్‌గా ఎంపికవడమే కాదు.కేశిక ఒక మ్యాగజైన్‌లో కథనం కూడా ప్రచురితమైంది.

తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి( R N Ravi )ఇలా ఎంపికైన యంగ్‌ అచీవర్లతో తన పుట్టినరోజు నిర్వహించుకోవాలి అనుకున్నారు.

అలా ఆయన్ని కలిసే వీలు దక్కడమే కాకుండా స్వయంగా ఆమె చేత్తో కేక్‌నీ తయారు చేసిచ్చిందట.

దాన్ని రుచి చూసి ఆయన ప్రశంసిస్తోంటే చాలా ఆనందమేసిందని కేశిక చెప్పుకొచ్చింది. """/" / నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి నా తల్లిదండ్రులే కారణం వాళ్ళ ప్రోత్సాహం వల్లే నేను చేయగలిగాను అని తెలిపింది కేశిక.

అలాగే వంటలు వండటమే కాదు బేకింగ్‌ వర్క్‌షాపులు, తరగతులు కూడా నిర్వహిస్తున్నాను అని తెలిపింది కేశిక.

కాగా ప్రస్తుతం ఆమె ఇంటర్‌ చదువుతోంది.అలాగే పబ్లిక్‌ స్పీకర్‌గా, యూట్యూబ్‌ యాంకర్‌( Youtube ANCHOR )గానూ సత్తా చాటుతోంది.

ఈ నైపుణ్యాలే తనకు టెడెక్స్‌ వేదిక మీదా మాట్లాడే అవకాశం కలిగించాయి.కేశిక జంతు ప్రేమికురాలు కూడా.

చెన్నైలోని ఒక ఎన్జీవోకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.దీని ద్వారా మూగజీవులకు ఆహారంతో పాటు వాటిని దత్తత తీసుకునే డ్రైవ్‌లను నిర్వహిస్తోంది.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మూడోతరం వారసుడు.. అవ్రామ్ లుక్ పై విష్ణు ఎమోషనల్ పోస్ట్!