ఎమర్జెన్సీ నెంబర్ 100 కు బదులుగా 112.. దేశమంతా ఇదేనట

ఎమర్జెన్సీ నంబర్ డయల్ 100గురించి అందరికీ తెలిసే ఉంటుంది.అసలు జనాలందరిలో ఎంతలా ఎమర్జెన్సీ నంబర్లు ఫీడ్ అయిపోయాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఏదైనా ప్రమాదం జరగగానే ఆటోమేటిగ్గా మన చేతులు డయల్ 100 మీదకు వెళ్తాయంటేనే అర్థం చేసుకోవచ్చు.

అది మన నిత్యజీవితంలో ఎంత ఇంపార్టెంట్ గా మారిపోయిందో.కానీ ప్రస్తుతం ఈ నెంబర్ ను మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది.

అందుకు అనుగుణంగా 100 కు బదులు 112 అనే నంబర్ ను తీసుకొచ్చింది.

తీసుకురావడమే కాకుండా ఈ నెంబర్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టి, విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ర్ట ప్రభుత్వాలకు సూచించింది.

రాష్ర్ట ప్రభుత్వాలు కూడా ఇందుకు తగ్గట్లుగా చర్యలు మొదలుపెట్టాయి.ఇప్పటికే పలు చోట్ల పోలీసు జీపులపై 112 అనే స్టిక్కర్లు కూడా దర్శనమిస్తున్నాయి.

అంతే కాకుండా గత కొన్ని రోజులుగా ఎవరైనా సరే 100 కు ఫోన్ చేస్తే 112 కు ఆటోమేటిక్ గా వేళ్లేలా సెట్ చేశారు.

కేంద్ర ఇలా నిర్ణయం తీసుకోవడానికి వేర్వేరు రాష్ర్టాల్లో ప్రమాదం సంభవించినపుడు సహాయం కోసం చేసే ఫోన్ నంబర్లు వేర్వేరుగా ఉండొద్దని దేశం మొత్తం మీద ఒకే నంబర్ ఉండాలని 112 నంబర్ తీసుకొచ్చింది.

ఈ నంబర్ గురించి సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయాలని కేంద్రం తెలిపింది.

మరో రెండు నెలల పాటు రాష్ర్టాల్లో ఉన్న పాత నంబర్లనే కొనసాగించిన తర్వాత 112 నంబర్ ను తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ఇక ఈ నెంబర్ కు సంబంధించి ఏకకాలంలో ఎంత మంది ఫోన్ చేసినా సరే కలిసే విధంగా పలు రాష్ర్టాల్లో ఇప్పటికే కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నారు.

ఈ కంట్రోల్ రూంల ద్వారా మొత్తం మానిటర్ చేయనున్నారు.సో త్వరలోనే మనదేశంలో నూతన ఎమర్జెన్సీ నంబర్ అందుబాటులోకి రానుంది.

రోడ్డు దాటుతూ వాహనదారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి.. ఆనంద్‌ మహీంద్రా రియాక్షన్ ఏంటంటే..