చిన్నారి పై కూడా జాతి విద్వేష వ్యాఖ్యలు

విదేశాల్లో ప్రవాసీయుల పై జాతి విద్వేష వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి.ఇలాంటి ఒక జాతి విద్వేష ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది.

సిక్కు బ్రిటీష్ గర్ల్ కు ఇటీవల ఇలాంటి జాతి విద్వేష ఘటన ఒకటి ఎదుర్కొంది.

ఆ చిన్నారి భాష,వస్త్రధారణ ను చూసి శ్వేత జాతి చిన్నారులు నువ్వు టెర్రరిస్ట్ వంటూ వ్యాఖ్యలు చేయడం తో ఆ పసి హృదయం విలవిల్లాడిపోయింది.

దీనితో ఒక వీడియో తీసి ఆచిన్నారి తన బాధను వెళ్లగక్కుకుంది.లండన్ లో ఓ పదేళ్ల సిక్కు బ్రిటిష్ గర్ల్ కు ఒక అనుభవం ఎదురైంది.

మున్సిమర్ కౌర్ అనే పదేళ్ల బాలిక గత సోమవారం ఆడుకోవడానికి ఓ ప్లే గ్రౌండుకు వెళ్ళినప్పుడు.

నలుగురు పిల్లలు కనిపించారట.మీరే ఆట ఆడుకుంటున్నారని ప్రశ్నించగా, నన్నూ ఆడనివ్వండి అని కోరగానే వారు ‘ వీల్లేదు.

నువ్వు టెర్రరిస్టువి ‘ అని గట్టిగా అరిచారని ఆమె ఓ వీడియోలో తెలిపింది.

ఇది తననెంతో బాధించిందని పేర్కొంది.మరుసటిరోజు 9 ఏళ్ళ అమ్మాయి నా స్నేహితురాలైంది.

అయితే గంటలోనే ఆమె తల్లి వచ్చి .తనను ప్రమాదకరమైన వ్యక్తి అని, అందువల్ల ఆడుకోరాదని అంటూ ఆ అమ్మాయిని తీసుకువెళ్లిపోయిందని ఇలా వరుస ఘటనలతో మున్సిపర్ కౌర్ బాధకు గురైంది.

ఇలాంటివారికందరికీ తన బాధను వెళ్లగక్కడానికి ఒక వీడియో చేసింది.సిక్కులు సహజంగా అందర్నీ అభిమానిస్తారు.

రేసిజం గురించి మాట్లాడే పిల్లలు తమ తలిదండ్రులకీ విషయం చెప్పాలి,ఇది తగదని వివరించాలి అని కౌర్ ఈ వీడియో ద్వారా కోరింది.

తలపాగా పెట్టుకోవడం నేరమా అని ప్రశ్నిస్తూ.ఆమె వీడియో సాగింది.

కౌర్ తండ్రి పోస్ట్ చేసిన ఈ వీడియోకు సుమారు 50 .వేల వ్యూస్ వచ్చాయి.

గత గురువారం ఇది లైవ్ గా వైరల్ కూడా అయింది.

ప్యారిస్ ఒలింపిక్స్ లో ముగిసిన భారత్ పతకాల వేట..