108 అంబులెన్స్ లోనే గర్భిణీ ప్రసవం….!

సూర్యాపేట జిల్లా: ప్రసవ వేదనతో బాధ పడుతున్న ఓ గర్భిణిని108 అంబులెన్స్( Ambulance ) లో ఆసుపత్రికి తరలిస్తుండగామార్గమధ్యలోనే అంబులెన్స్ లో ప్రసవించిన సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా( Suryapet District )లో చోటుచేసుకుంది.

నూతనకల్ మండలం తాళ్ల సింగారం గ్రామానికి చెందిన నిండు గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతుండగా బంధువులు 108కు సమాచారం అందించారు.

వెంటనే గ్రామానికి చేరుకున్న 108 ఆమెను జిల్లా కేంద్రంలోని మాతా శిశు హాస్పిటల్ కి తీసుకొస్తుండగా నెమ్మికల్ సమీపంలో పురిటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ సిబ్బంది ఆమెకు ప్రసవం చేయడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

తల్లి బిడ్డను అలాగే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగాఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఎలాంటి ఇబ్బందీ లేకుండా అంబులెన్స్ లో ప్రసవం చేసిన ఈఎంటి బానోతు రమేష్,పైలట్ బంటు నాగేశ్వరరావులను బంధువులు అభినందించారు.

ఈ యూకే ఖైదీ చాలా డేంజరస్.. 50 ఏళ్లుగా జైల్లోనే..?