నూతన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 108 కలశములచే ధ్వజస్తంభ ప్రతిష్ట శిఖరాభిషేకం..
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము లో నూతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మూడవరోజు శుక్రవారం తొగుట రంగంపేట కు చెందిన శ్రీ శ్రీ శ్రీ పరమ హంస పరి వ్రాజకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ మాధవా నంద సరస్వతీ స్వాములవారి కర కమలములచే యంత్ర ప్రతిష్ట,విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, వైభవంగా జరిగింది.
గర్తన్యాసం,పూజ కళాన్యాసము , హావనం, పూర్ణహుతి , మహాకుంభాభిషేకం 108 కలశములచే శిరాభిషేకం నిర్వహించారు.
అనంతరం పాల్గొన్న భక్తకోటికి తీర్థ ప్రసాదములు మహాప్రసాద భోజన వసతి కల్పించారు.ఈ సందర్భంగా పాల్గొన్న భక్తకోటికి ఎల్లారెడ్డిపేట మండల ఆర్యవైశ్య సంఘం వారు తీర్థ ప్రసాద వితరణ భోజన వసతులు కల్పించారు.
సంక్రాంతి సినిమాలతో దిల్ రాజుకు పూర్వ వైభవం దక్కుతుందా.. ఆ రేంజ్ హిట్లు సాధిస్తాడా?