10 నిమిషాల్లో 10000 టిక్కెట్లు..బెంగళూరు సిటీ లో ‘సలార్’ అన్ బీటబుల్ రికార్డు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'సలార్( Salaar )' మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.

ప్రభాస్ కెరీర్ మొత్తం మీద ఈ స్థాయి హైప్ ఉన్న సినిమా మరొకటి రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

బాహుబలి 2 కంటే ఈ సినిమాకే ఎక్కువ హైప్ ఉంది.రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కి ఆశించిన స్థాయి రెస్పాన్స్ రాకపోయినా, మొదటి లిరికల్ వీడియో సాంగ్ సూరీడు కి మాత్రం బంపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ సాంగ్ ని చూసిన తర్వాత అర్థం అయ్యింది ఏమిటంటే ఈ చిత్రం లో యాక్షన్ ఎంత అయితే ఉంటుందో సెంటిమెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది అనేది అర్థం అయ్యింది.

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి కాపీ ప్రివ్యూ షో ని కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తులకు వేశారు.

"""/" / ఈ ప్రివ్యూ షో నుండి మామూలు రెస్పాన్స్ రాలేదు.సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఎప్పటి చూడని విధంగా ఉంటుంది అట.

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఫైట్ సన్నివేశానికి థియేటర్స్ పరిస్థితి ఊహించడానికే సాధ్యం కాదని అంటున్నారు.

అంతే కాకుండా ఈ సినిమాకి సంబంధించి సప్రైజ్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయట.వాటిని లీక్ కాకుండా మూవీ టీం చాలా జాగ్రత్తలు తీసుకుంది.

ఇకపోతే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కోసం ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ముందుగా నైజాం ప్రాంతం లో బుకింగ్స్ ఓపెన్ చేస్తారని అనుకున్నారు.కానీ కర్ణాటక ప్రాంతం లో ఓపెన్ చేసారు.

సాధారణంగా తెలుగు సినిమాలకు ఇక్కడ కాస్త అడ్వాన్స్ బుకింగ్స్ స్లో గా ఉంటాయని అందరు అంటుంటారు, కానీ సలార్ చిత్రానికి బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధి లోనే హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.

"""/" / 'బుక్ మై షో( BookMyShow )' నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు పది వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట.

అది కూడా కేవలం 10 నిమిషాల వ్యవధి లోనే.బుకింగ్స్ ప్రారంభించారు అని ఆన్లైన్ సమాచారం అందినంతసేపు కూడా పట్టలేదు, ఫ్యాన్స్ షోస్ టిక్కెట్లు అమ్ముడుపోడానికి.

ఇతర రాష్ట్రం లోనే ఇలా ఉంటే, ఇక తెలుగు రాష్ట్రాల్లోని అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయిలో ఉంటే మీ ఊహకే వదిలేస్తున్నాము.

రేపు లేదా ఎల్లుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!