గిన్నీస్ రికార్డ్ : ఒకటే కంపెనీలో 100వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఉద్యోగి..

సాధారణంగా ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగులు రెండు మూడేళ్ళ కొకసారి కంపెనీ మారడం చూస్తుంటాం.

మహా అయితే ఒక 20 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేస్తారు.కానీ.

వీటన్నింటికి భిన్నంగా ఒక వ్యక్తి 80 సంవత్సరాలకు పైగా ఒకే కంపెనీలో పనిచేస్తున్నాడు.

దీన్ని వినగానే ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది కదూ.వివరాల్లోకి వెళ్తే.

బ్రెజిల్‌కు ఓ వ్యక్తి మాత్రం.గత 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తూ.

అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.అదే కంపెనీలో తాజాగా ఆయన తన 100వ పుట్టినరోజును కూడా కంపెనీలోనే జరుపుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.ఎస్​.

ఏ అనే టెక్స్‌టైల్ కంపెనీలో.వాల్టర్ ఓర్త్‌మాన్ బ్రస్క్‌లోని రెనాక్స్ అనే వ్యక్తి 1938 జనవరి 17 నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు.

తనకు 15 సంవత్సరాల వయస్సులో ఆయన ఈ కంపెనీలో చేరారు.షిప్పింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌గా తన కెరీర్​ను ప్రారంభించిన వాల్టర్.

సేల్స్​ మేనెజర్​గా.మరియు అనేక హోదాలు పొందారు.

దాదాపు తొమ్మిది వేర్వేరు కరెన్సీ డినామినేషన్లలో లావాదేవీలు జరిపిన అనుభవం కూడా ఆయనకు ఉంది.

ఇంతటి సుధీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్న వాల్టర్.గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించారు.

ఏప్రిల్ 19న వాల్టర్​.తన 100వ జన్మదినాన్ని కూడా జరుపుకున్నారు.

"""/" / కంపెనీలో చేరిన మొదటి రోజులను ఆయన గుర్తు చేసుకుంటూ.ఫోన్లు, కంప్యూటర్లు లేని రోజులను నెమరువేసుకున్నారు.

వీధులు సరిగా లేకుండా వర్షం పడితే బురదగా మారేవని తెలిపారు.అప్పట్లో ఇంటికో బావి ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రస్తుతం సాంకేతికత వల్ల ఎక్కడి నుంచైనా వ్యాపారం చేయవచ్చని.ఈ వెసులుబాట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శతృత్వం వద్దు.అవసరం అయితే క్షమాపణలు చెప్పండి.

ప్రశాంతంగా జీవించండి.జీవితాన్ని ఆస్వాదించండి అని ఆయన తన జీవిత విశేషాలను అందరికీ తెలిపారు.

ఫోటో వైర‌ల్‌: ఇదేందయ్యా ఇది.. ఫ్యామిలీ మొత్తానికి క‌టౌట్‌ పెట్టేసారుగా