గాల్వాన్ ఘర్షణ పై మాజీ అధికారి సంచలన వ్యాఖ్యలు అంటూ వస్తున్న వార్తలు తప్పు..

ఇటీవల భారత్-చైనా దళాల మధ్య గాల్వాన్ వ్యాలీ లో ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘర్షణ లో తెలంగాణా వాసి కల్నల్ సంతోష్ బాబు తో సహా మొత్తం 21 మంది భారత సైనికులు వీర మరణం పొందగా,చైనా సైనికుల గురించి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు.

గాల్వాన్ వ్యాలీ లో భారత భూభాగాన్ని ఆక్రమించడానికి చైనా,భారత్ పై కాలు దువ్వుతుంది.

ఈ క్రమంలో అక్కడ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన క్రమంలో కల్నల్ సంతోష్ బాబు కూడా అక్కడకి వెళ్లడం ఆ సమయంలో కొంత వాగ్వివాదం చోటుచేసుకోవడం ఆ తరువాత అది ఘర్షణకు దారి తీసింది.

ఈ క్రమంలో చైనా ఆర్మీ భారత ఆర్మీ పై రాళ్లతో దాడి కి దిగడం తో ఈ దాడిలో కల్నల్ సంతోష్ బాబు తో సహా 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు.

అయితే ఈ ఘర్షణ లో చైనా సైనికులు ఎందరు మరణించారణే విషయాన్ని ఆ దేశ ప్రభుత్వం మాత్రం ప్రకటించలేదు.

కానీ, దాదాపు 40 మంది చైనా సైనికులు మరణించారని అంతర్జాతీయ మీడియాలో మాత్రం కధనాలు వచ్చాయి.

జూన్ 15 అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ పరిణామం తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే భారత్ చైనా కు సంబందించిన పలు యాప్ లపై నిషేధం కూడా విధించింది.

H3Corrections : 7/11/2020/h3 ఈ పోస్ట్ ముందు వర్షన్ లో "ఈ గాల్వాన్ వ్యాలీ ఘర్షణ లో దాదాపు 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారంటూ క్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

" అన్ని తప్పుడు గా పబ్లిష్ చేసాం.పోస్ట్ చేసినందుకు మన్నించగలరు.

గల్వాన్ ఘటనలో 100 మందికి పైగా చైనా సైనికులు చనిపోయారని జియాన్లీ యాంగ్ ఎక్కడా చెప్పలేదు.

అంతేకాదు, పోస్ట్ లో చెప్పినట్టు జియాన్లీ యాంగ్ చైనా మాజీ సైనిక అధికారి కాదు.

కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.పూర్తి వివరాల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి చూడండి.

2025లో ఫ్యాన్స్ కు షాకిస్తున్న ముగ్గురు టాలీవుడ్ స్టార్స్ వీళ్లే.. ఫ్యాన్స్ కు ఇబ్బందేగా!