పదేళ్లకే ఎవరెస్ట్ ఎక్కిన పాప.. ఈ ఫీట్ ఎలా సాధించిందంటే..!

ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వతం ఎవరెస్టు ఎక్కాలంటే చాలా స్టామినా కావాలి.బలవంతులకైనా సరే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు వెళ్లేందుకే చాలా కష్టంగా అనిపిస్తుంది.

ఈ జర్నీ లో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది.

అలాంటిది తాజాగా ఒక పదేళ్ల చిన్నారి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకొని రికార్డు సృష్టించింది.

ఆ చిన్నారి పేరే రిథమ్ మమానియా.ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న అతి పిన్నవయస్కురాలైన భారతీయురాలిగా ఈ చిన్నారి చరిత్ర సృష్టించింది.

5,364 మీటర్ల ఎత్తులో ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంపును 11 రోజుల్లోనే చేరుకుంది.

మే 6న మధ్యాహ్నం ఒంటిగంటకు తన బిడ్డ ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు వెళ్లగలిగిందని తల్లి ఉర్మి మీడియాకి తెలిపారు.

మహారాష్ట్రకు చెందిన రిథమ్ బాంద్రాలోని ఎంఈటీ రిషికుల్ విద్యాలయాలో ఐదవ తరగతి చదువుతోంది.

ఈ బాలిక 11 రోజుల్లో డైలీ ఏకంగా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నడిచింది.

అంటే ఎంత శ్రమ పడిందో అర్థం చేసుకోవచ్చు.సాధారణ వాతావరణ పరిస్థితుల్లో నడవటం వేరు తరచూ మంచు వర్షాలు కురిసే ఎవరెస్టు పర్వతంపై నడవడం వేరు.

ఈ బాలిక మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా నడుస్తూ తన వయసు కంటే సంకల్పం గొప్పదని నిరూపించింది.

"""/"/ రిథమ్ ఈ ఫీట్‌ సాధించేందుకు నేపాల్​కు చెందిన సతోరీ అడ్వెంచర్స్ అనే కంపెనీ సహాయం తీసుకుంది.

అయితే వచ్చేటప్పుడు హెలికాప్టర్‌లో కిందకి దిగుతామని ట్రెక్కింగ్ టీమ్‌ భావించింది కానీ అందుకు రిథమ్ అస్సలు ఒప్పుకోలేదు.

నడిచే కిందకి వెళ్దామని పట్టుబట్టి మరీ నడిచి కిందకు దిగింది.రిథమ్‌లో ఇంత స్టామినా ఉండటానికి గల కారణం ఈ చిన్నారి తన ఐదేళ్ల ప్రాయం నుంచే కొండలు ఎక్కడ స్టార్ట్ చేసింది.

అలాగే స్కేటింగ్ కూడా నేర్చుకుని తన సత్తా చాటుతోంది.

కూటమికి చిరు మద్దతు తెలపడానికి అదే కారణం.. పిఠాపురంలో పవన్ గెలుపు కష్టం: చిట్టిబాబు