పాము చర్మంతో బాలుడు.. ఏం చేస్తున్నాడు అంటే?

పాము చర్మం పొలుసుల ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇలా పాము పెరిగే క్రమంలో ప్రతి ఆరు నెలలకోసారి చర్మంపై పైపొరలను విడిచేస్తుంది దాన్ని కుబుస విసర్జన అని అంటారు.

అయితే ఇది జరిగే ప్రక్రియ మరి ఇలా మనుషుల్లో కూడా జరుగుతుందా? మనుషులు కూడా పాముల్లా చర్మాన్ని విడుస్తారా? అంటే నిజమే అని అనిపిస్తుంది ఒడిశాలోని ఓ పిల్లాడిని చూస్తే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒడిశాలోని గంజాం జిల్లాలో నివసిస్తున్న జగన్నాథ్ అనే పదేళ్ల బాలుడు ఈ సమస్యను ఘోరాతి ఘోరంగా ఎదురుకుంటున్నాడు.

అతడి చర్మం పాము పొరలు పొరలుగా ఏర్పడుతుంది నల్లగా అవుతుంది.శరీరం అంత పొడిబారిపోతుంది.

అయితే పాము చర్మంలా అవ్వడానికి కారణం అతనికి వింతైన చర్మ వ్యాధి ఉంది.

ఆ వ్యాధితో అతను బాధపడుతున్నాడు.ఇంకా ఈ వ్యాధి పేరు లామెల్లార్ ఇచ్థియోసిస్.

ఈ వ్యాధి అతనికి చిన్న వయసులో లేదు కానీ, వయస్సు పెరిగే కొద్ది అతడిలో మార్పు కనిపించడం మొదలైంది.

ఇంకా అలానే ఆ చర్మం రోజు పొడిబారడం బిగుసుకుపోవడం నెలకు ఒకసారి పొరలు పొరలుగా చర్మం ఊడిపోవడం జరుగుతుంది.

చర్మం బిగుసుకుపోవడం వల్ల నడవడం కూడా కష్టమవుతుంది.దీంతో అతడు కర్ర సాయంతో నడుస్తున్నాడు.

చర్మం పొడిబారకుండా ప్రతి పావుగంటకు ఒకసారి చర్మానికి స్కిన్ లోషన్లు రాస్తున్నాడు.కాగా ఈ పిల్లాడి చర్మ వ్యాధికి మందు లేదు అని, నివారణ అసాధ్యం అని స్థానిక డెర్మటాలజిస్టులు చేతులెత్తేశారు.

కాగా లామెల్లార్ ఇచ్థియోసిస్ అనేది చాలా అరుదైన సమస్య అని, ప్రపంచంలో ప్రతి ఆరు లక్షల మందిలో ఒకరికి భిన్న రకాల్లో ఈ సమస్య వస్తుందని, జగన్నాథ్‌కు వచ్చిన సమస్య చాలా తీవ్రమైనదని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు.

కాగా బాలుడి తల్లితండ్రుల ఆర్ధిక పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్3, సోమవారం 2024