1582 అక్టోబర్‌లో 10 రోజులు మాయం.. దాని వెనుక గల కారణాలు ఇవే..

1582వ సంవత్సరంలో అక్టోబర్ నెలలో 10 రోజులు మాయమయ్యాయి.మొబైల్స్‌లోని క్యాలెండర్ యాప్స్ ఓపెన్ చేసి ఈనెల తేదీలను పరిశీలిస్తే అక్టోబర్ 4 తర్వాత 5-14 రోజులు స్కిప్ అయిపోయి 15వ తేదీ మాత్రమే కనిపిస్తోంది.

ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ సంవత్సరంలో అక్టోబర్ నెలలో పది రోజులు మాయం అయినట్లు చాలామంది స్క్రీన్‌షాట్స్‌తో సహా పంచుకుంటున్నారు.

దీన్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.అసలు ఈ సంవత్సరంలో అది కూడా ఒక్క అక్టోబర్ నెలలోనే 10 రోజులు ఎందుకు మాయమయ్యాయి? ఇప్పుడు తెలుసుకుందాం.

దీని వెనుక కారణం ఏంటో తెలియదు కానీ తాజాగా అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డిగ్రాస్ టైసాన్ ఒక ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌లో '1582 నాటికి జూలియన్ క్యాలెండర్ ప్రతి నాలుగేళ్లకు ఒక లీప్ డేతో, భూమి కక్ష్యకు సంబంధించి ఎక్స్‌ట్రా రోజులను సేకరించింది.

దీనివల్ల తేదీల్లో అవకతవకలు వచ్చాయి.అప్పుడే పోప్ గ్రెగొరీ ఆ ఏడాది అక్టోబర్ నెలలో పది రోజులు తొలగించి తన కొత్త, కచ్చితమైన క్యాలెండర్‌ను రూపొందించాడు.

అలా అక్టోబర్ 4 తర్వాత డైరెక్ట్‌గా 15 వచ్చింది' అని వివరించారు. """/"/ అయితే ఇతడు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు కానీ నేటిజెన్లు మాత్రం సంతృప్తి చెందడం లేదు ఎందుకంటే ఒక అక్టోబర్ నెలలోనే పది రోజులు ఎందుకు తీసేయాలి? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏదేమైనా ఈ పది రోజులు మిస్సింగ్ అనేది ఇప్పుడు చాలా మిస్టరీగా మారింది అలాగే చర్చనీయాంశమయ్యింది.

టమాటా నారు పెంపకంలో పాటించాల్సిన సరైన యాజమాన్య పద్ధతులు..!