త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న బాలీవుడ్ లవ్ బర్డ్స్

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో లవ్ బర్డ్స్ గా ఉన్న వారు చాకొలేట్ బాయ్ రణ్ బీర్ కపూర్,యంగ్ భామ అలియా భట్.

వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా లవ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

అయితే ఎప్పుడు వీరు పెళ్లి పీటలు ఎక్కుతారు అన్న దానిపై మాత్రం ఎప్పటికప్పుడు ఒక కన్ఫ్యూజన్ మాత్రం ఉంటూనే ఉంది.

అయితే తాజాగా వీరిద్దరూ ఈ అక్టోబర్ లో నిశ్చితార్ధం జరుపుకొని వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.

అస‌లు వివాహం ఇదే ఏడాదిలో జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికి, ర‌ణ్‌బీర్ తండ్రి అనారోగ్యానికి గుర‌వ్వ‌డం, అలియా హెల్త్ కూడా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో పెళ్ళిని వ‌చ్చే ఏడాదికి వాయిదా వేసి ఉంటార‌ని అందరూ భావిస్తున్నారు.

ఆ మ‌ధ్య జ‌రిగిన ఫిలిం ఫేర్ అవార్డు వేడుక‌లలో ర‌ణ్‌బీర్ క‌పూర్ సంజూ చిత్రానికి ఉత్త‌మ న‌టుడు అవార్డు అందుకోగా, అలియా భ‌ట్ రాజీ చిత్రానికి గాను ఉత్తమ న‌టి అవార్డు గెలుచుకుంది.

ఆ స‌మ‌యంలో అలియా మాట్లాడుతూ.ఇక్క‌డ నాకు సంబంధించి ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి ఉన్నారు.

ఐ ల‌వ్ యూ ర‌ణ్‌బీర్ అంటూ మ‌న‌సులోని మాట‌ని బ‌య‌ట‌పెట్టేసింది అలియా.వీరిద్దరి మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుంది.

గతంలో కూడా రణ్ వీర్ పలువురి తో ప్రేమాయణం నడిపినప్పటికీ ఈ సారి ఆలియా తో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి ఈ జంట వచ్చే ఏడాది పెళ్లి బంధం తో ఒక్కటి కాబోతుంది అంటూ తెగ ప్రచారం అయితే జరుగుతుంది.

మరి ఎప్పుడు వీరి పెళ్లి జరగబోతుందో అన్న వివరాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.