బీజేపీలోకి టీడీపీ ఎంపీలు ! బాబు హస్తం ఉందా ?

ఎట్టకేలకు టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురు కాషాయ కండువా కప్పేసుకున్నారు.టీడీపీ అధినేత చంద్రబాబు కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ వస్తున్నయలమంచిలి వెంకట సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేశ్‌ మూకుమ్మడిగా బీజేపీలో చేరిపోయారు.

అయితే వీరంతా బాబు సూచనా మేరకే బీజేపీలోకి వెళ్లారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కుంటూ ఉండడం, కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణ లో టీఆర్ఎస్ ఇలా బాబు శత్రువులు అంతా అధికారంలో ఉండడంతో ఇక తనకు, తన సన్నిహితులకు కేసుల బెడద తప్పదని ముందే గ్రహించి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సుజనా చౌదరి, సీఎం రమేష్‌ల వ్యాపార, ఆర్థిక వ్యవహారాలన్నీ చంద్రబాబుకు బినామీలుగానే చేశారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఇక నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీ మారినా బాబు లో ఎటువంటి ఆందోళన కనిపించడంలేదు.

పైగా ఇదేమి టీడీపీకి కొత్త కాదు అంటూ లైట్ తీసుకుంటున్నారు.గురువారం మ‌ధ్యాహ్నం టీడీపీ నుంచి న‌లుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లినా బాబు లో పెద్దగా రియాక్షన్ లేకపోవడం అందరికి అనుమానాలు కలిగిస్తోంది.

ఐదేళ్లు అధికారానికి టీడీపీ దూరంగా ఉండాల్సిందే.అధికారం లేక‌పోతే ఏమీ చేయ‌లేరు.

పైగా టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఆదాయానికి ఆస్తులున్న కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.

వారు ఇంకా టీడీపీని పట్టుకుని వేలాడితే వారిని కాపాడ‌టం బాబు కి కూడా కుదరని పని.

"""/"/ త‌న కుడిభుజాలైన సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి బీజేపీ తీర్థం పుచ్చుకుంటేనే వారికి కేసుల నుంచి రక్షణ లభిస్తుంది.

బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం ఎటువంటి భయం ఉండదు.అవసరమైతే ఈ ఐదేళ్ల తరువాత తెలుగుదేశం పార్టీలోకి వారు నిస్సందేహంగా రావొచ్చు అనే ప్లాన్ తో బాబు పూరమాయించినట్టు ఏపీ అధికార పార్టీ వైసీపీ అనుమానిస్తోంది.

అదీ కాకుండా చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలసి యూరప్‌ పర్యటకు బుధవారం అలా వెళ్లారో లేదో ఇటు వైపు టీడీపీ ఎంపీలు నలుగురు బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు లీకులు ఇవ్వడం ఇవన్నీ అనేక అనేక అనుమానాలకు కారణం అయ్యింది.

ప్రభాస్ హను రాఘవవూడి సినిమాలో చేయబోయే క్యారెక్టర్ లో భారీ మార్పులు…