హైకోర్టులో ఎమ్మెల్యే గాదరి కిశోర్ కి చుక్కెదురు…!

సూర్యాపేట జిల్లా: అధికార బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలకు హైకోర్టులో వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు( Vanama Venkateshwara Rao )గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగానే ఆలేరు ఎమ్మెల్యేకు జరిమానా విధించిన విషయం కూడా విదితమే.ఇప్పుడు మరో బీఆర్ఎస్ నేత,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ వంతు వచ్చింది.

ఆయనకు మంగళవారం తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.2018 ముందస్తు ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గాదరి కిషోర్( Gadari Kishore Kumar ) ఎన్నిక చెల్లదని ఆయన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి అద్దంకి దయాకర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దానికి కౌంటర్ గా ఎన్నిక వివాదం కేసులో ఎమ్మెల్యే గాదరి కిషోర్ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్ ను హై కోర్టు కొట్టేసింది.

మెట్లు ఎక్క‌డం వ‌ల్ల లాభాలేంటి.. రోజుకు ఎంతసేపు మెట్లు ఎక్కొచ్చు?