తుది దశలో “హెచ్ 4” వీసా రద్దు.. “70 వేల” భారత టెకీలకి షాకే
TeluguStop.com
హెచ్ -1బీ వీసా తో భారతీయలకి చెక్ పెడుతూ వస్తున్న అమెరికా ప్రభుత్వం మెల్ల మెల్లగా హెచ్ -4 స్పౌస్ వీసాపై కూడా ఆంక్షలు పెడుతూ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే తాజగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హెచ్ 4 వీసాలను రద్దు ప్రక్రియ జరుగుతుంది ఈ ప్రక్రియ తుది దశలో ఉందని అమెరికా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
అమెరికాలో ఉండే తమ పౌరులకి మాత్రమే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యం తో ట్రంప్ సర్కార్ హెచ్ 1 బీ వీసాల జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.
హెచ్ 1 బీ వీసాదారుల జీవిత భాగస్వామ్యులకు కల్పించే హెచ్ 4 వీసాల విషయంలో కూడ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే ఈ వీసాలను రద్దు చేసే నిర్ణయం చివరి దశలో ఉందని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా కోర్టుకు తెలిపింది
అంతేకాదు ఈ వీసాలని రద్దు చేయడం వలన అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది ఇండియన్ టెక్కీలపై ఆ ప్రభావం కన్పించనుంది.
ఈ వీసాలను రద్దు చేసేందుకు అమెరికా సర్కార్ ఆసక్తిని చూపుతోంది.ఇదే విషయాన్ని అమెరికా సర్కార్ ఫెడరల్ కోర్టుకు గురువారం నాడు ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న కాలంలో హెచ్ 1 బీ వీసాలపై పనిచేస్తున్నవృత్తి నిపుణుల జీవిత భాగస్వామ్యులు హెచ్ 4 వీసాలతో అమెరికాలో నివసించేందుకు అనుమతి ఇచ్చారు.
అయితే ఒబామా సర్కార్ గద్దె దిగిన వెంటనే ట్రంప్ తన పౌరులకి ఇచ్చిన మాట ప్రకారం భారతీయులని.
ఇంటికి పంపే పనిలో సర్కారు ఉంది.హెచ్ 4 వీసాదారులు ఉద్యోగం చేయడానికి ఇచ్చే అనుమతులను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ చర్యల వలన సుమారు 70 వేల మంది ఇండియన్ టెక్కీలు ఇక ఇంటి బాట పట్టాల్సిందే.
ఇదే జరిగితే ఈ ప్రభావం భారత సాఫ్ట్వేర్ పైన కూడా తీవ్రమైన ప్రభావం కూడా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
భాగస్వామి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రష్మిక.. అలా చెప్పడంతో?