స్కిన్ టోన్ పెర‌గాలా? అయితే కందిప‌ప్పుతో మీరిలా చేయాల్సిందే!

స్కిన్ టోన్‌ను మెరుగు ప‌రుచుకోవాల‌నే కోరిక దాదాపు అంద‌రికీ ఉంటుంది.ఈ క్ర‌మంలోనే కొంద‌రు మార్కెట్‌లో దొరికే ఖ‌రీదైన‌ స్కిన్ వైట్ నింగ్ క్రీములు కొనుగోలు చేసి వాడుతుంటారు.

అలాగే మ‌రికొంద‌రు చ‌ర్మానికి అవీ, ఇవీ పూసి ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తుంటాయి.అయితే ఎటువంటి ఖ‌ర్చు లేకుండా కేవ‌లం ఇంట్లో ఉండే కంది ప‌ప్పుతోనే స్కిన్ టోన్ ను పెంచుకోవ‌చ్చు.

అవును, మీరు విన్న‌ది నిజ‌మే.మ‌రి లేటెందుకు కందిప‌ప్పును చ‌ర్మానికి ఎలా యూజ్ చేయాలో ఓ లుక్కేసేయండి.

ముందుగా ఒక చిన్న క‌ప్పులో పెరుగులో రెండు స్పూన్ల కందిప‌ప్పు వేసి గంట పాటు నాన‌బెట్టుకుని.

ఆపై మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఇందులో అర స్పూన్ క‌స్తూరి ప‌సుపు, ఒక స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని.

ముఖానికి, మెడ‌కు అప్లై చేసుకోవాలి.ఇర‌వై నిమిషాల పాటు ఆరినిచ్చి.

అప్పుడు గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే మీ చ‌ర్మం వైట్‌గా, బ్రైట్‌గా మార‌డ‌ట‌మే కాదు.

మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. """/" / అలాగే కంది ప‌ప్పుతో మ‌రో అద్భుతమైన ప్యాక్ ఏంటంటే.

ఒక చిన్న క‌ప్పు వాట‌ర్‌లో రెండు స్పూన్ల కందిప‌ప్పు వేసి రెండు లేదా మూడు గంట‌ల పాటు నాన‌పెట్టుకోవాలి.

ఆపై కందిప‌ప్పును మెత్త‌గా రుబ్బుకోవాలి.ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, ఒక స్పూన్ పాలు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.

అనంత‌రం ఈ మిశ్ర‌మానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాస్ చేసుకోవాలి.

ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తే గ‌నుక స్కిన్ టోన్ అద్భుతంగా పెరుగుతుంది.

మ‌రియు చ‌ర్మం స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మారుతుంది.

పైసా ఖ‌ర్చు లేకుండా ఇంట్లో ఉండే ఈ రెండిటితో హెయిర్ ఫాల్‌కు చెక్ పెట్టొచ్చు.. తెలుసా..?