సీతను ఎత్తుకెళ్లింది రావణుడు కాదట! ఎంతటి అపచారమో చూడండి.! అసలేమైంది?
TeluguStop.com
హిందూ పురాణాల్లో ఒకటైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి, ఆ మాట కొస్తే దాదాపు అందరికీ తెలుసు.
రాముడి జననం, రాక్షసులను సంహరించడం, సీతను పరిణయమాడడం, అడవులకు వెళ్లి వనవాసం చేయడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, రాముడు రావణున్ని సంహరించడం… ఇలా అనేక కాండలలో రామాయణాన్ని వాల్మీకి కవి అద్భుతంగా రచించి భక్తులకు ఆ గ్రంథం పవిత్రతను తెలియజేశాడు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే ‘రామాయణమంతా విని.రాముడు, సీతకు ఏమవుతాడు’ అని అడిగాడట ఓ ప్రబుద్ధుడు.
గుజరాత్ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.గుజరాత్‌లోని ఏడో తరగతి సంస్కృత పుస్తకంలో వచ్చిన ఓ తప్పిదం ఇప్పుడు చర్చనీయంగా మారింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
‘రామాయణం’లోని కీలకమైన ఘట్టాన్నే మార్చేశారు.రావణుడు సీతమ్మను ఎత్తుకుపోయాడని లక్ష్మణుడు.
రాముడుకు చెప్పే సన్నివేశంలో ‘‘సీతమ్మను రాముడు ఎత్తుకెళ్లాడు’’ అని ఉంది.వివాదంగా మారడంతో దీనిపై బోర్డు కూడా వివరణ ఇచ్చింది.
‘‘అనువాదంలో ఏర్పడిన లోపం వల్ల రావణుడికి బదులుగా రాముడు అని అచ్చయ్యింది.గుజరాతీ పుస్తకంలో మాత్రం ఇది సరిగానే ఉంది’’ అని తెలిపారు.