సిగ్నల్ తిప్పలతో మంత్రి చేసిన ఈ పనికి అందరూ షాక్…
TeluguStop.com
ప్రస్తుతం కాలమంతా నడిచేది మొబైల్స్ ద్వారానే అనేది మనం కాదనలేని వాస్తవం.మొబైల్ లేనిది ఒక్కపూట కూడా గడపలేని పరిస్థితి నెలకొంది.
అంతలా మనుషుల జీవితాలు మొబైల్ ఫోన్ తో ముడిపడి ఉన్నాయి.ఇక ఒకరోజు మొబైల్ పనిచేయకపోయినా, సిగ్నల్ వీక్ గా ఉంటే ఎన్నో సంచలనాలు జరుగుతాయి కదా.
ప్రస్తుతం మొబైల్స్ కు సిగ్నల్స్ చక్కగా అందే విధంగా నెట్ వర్క్ సిస్టమ్ ఉంది.
కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఇప్పుడు నెట్ వర్క్ సమస్యలు దాదాపు లేవనే చెప్పవచ్చు.
కాని ఏదో ఒక సమయంలో అర్జెంట్ గా ఫోన్ కాల్ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పుడు కలిగే ఇబ్బంది మామూలుది కాదు.
అచ్చం ఇలాగే ఓ మంత్రికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అశోక్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.
కొన్ని కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం ఓ మారుమూల గ్రామానికి మంత్రి వెళ్లడంతో అక్కడ ఉన్న ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు.
అయితే వెంటనే సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నించగా సెల్ ఫోన్ సిగ్నల్ దొరకలేదు.
వెంటనే అక్కడ ఉన్న జాయింట్ వీల్ పైకి వెళ్లిన తరువాత నిలిపివేశారు.ప్రస్తుతం ఆ సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. గర్వపడేలా చేస్తానంటూ?