సింగపూర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో...తెలుగు మహిళలు

తెలుగు రాష్ట్రాలకి చెందిన మహిళా ఎన్నారై లు సింగపూర్ లో తమ సత్తా చాటుతున్నారు.

ఏకంగా సింగపూర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో.స్థానం సంపాదించారు.

వివరాలలోకి వెళ్తే.వివేకానంద్‌ సేవా సంఘ్‌ ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఇండియన్‌ ట్రెడిషనల్‌ గేమ్స్‌ ఫెస్టివల్‌(ఐటీజీఎఫ్‌)2018 ఆటలపోటీలు జరిగాయి.

సింగపూర్‌లోని బెడాక్‌ స్టేడియం నిర్వహించిన ఈ ఆటల పోటీల్లో సింగపూర్‌ తెలుగు సమాజం(ఎస్‌టీఎస్‌)కి చెందిన పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఈ ఫోటీలలో కుంటాట లో ఎస్‌టీఎస్‌ మహిళల జట్టు విజేతగా నిలవగా, కోకో పోటీల్లో ఎస్‌టీఎస్‌ పురుషుల జట్టు రన్నరప్‌గా నిలిచింది.

అంతేకాదు అతిపెద్ద రంగోళి పోటీల్లో ఎస్‌టీఎస్‌ మహిళలు పాల్గొని అతి పెద్ద ముగ్గుని వేసి ఏకంగా సింగపూర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సాధించారు.

అలాగే కోకో, కబడ్డీ వంటి ఆటల్లో ఎస్‌టీఎస్‌ పిల్లలు సిఅతం ఎంతో చురుకుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సింగపూర్‌ పార్లమెంట్‌ సభ్యులు చెరిల్‌ చాన్‌, హైకమిషనర్‌ ఆఫ్‌ ఇండియా జావెద్‌ అశ్రఫ్‌, సింగపూర్‌ తెలుగు సమాజం వైస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతీశ్వర్‌ విచ్చేసి అందరినీ అభినందించారు.

వివేకానంద సేవా సంఘ్‌ చేపట్టిన ఈ కార్యక్రమాన్నిజ్యోతీశ్వర్‌ రెడ్డి అభినందించారు.ఇప్పటి వరకూ ఏ ఒక్క ఎన్నారై కూడా సింగపూర్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించలేదని.

బుక్స్ ఆఫ్ సిగాపూర్ ప్రతినిధులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ పొలిటీషియన్ అయిన కూడా సినిమాలు చేయడానికి కారణం ఏంటో తెలుసా..?