సభ్యత, సంస్కారం లేని వ్యక్తి పవన్..: మంత్రి కారుమూరి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కారుమూరి తీవ్రంగా మండిపడ్డారు.సభ్యత, సంస్కారం లేని వ్యక్తి పవన్ అంటూ ధ్వజమెత్తారు.

సీఎం జగన్ ను పవన్ ఏకవచనంతో సంభోధిస్తున్నారని తెలిపారు.ప్రజా సేవలో ఉన్న వాలంటీర్ల పట్ల నీచంగా మాట్లాడారని మంత్రి కారుమూరి విమర్శించారు.

ఎమ్మెల్యే కానీ సీఎం కానీ కావాలనే ఆలోచన పవన్ కు లేదన్నారు.చంద్రబాబుకు ప్యాకేజ్ స్టార్ గా మాత్రమే పవన్ మిగిలారని కారుమూరి ఆరోపించారు.

పుంగనూరులో గూండాలతో చంద్రబాబు విధ్వంసం చేశారని మండిపడ్డారు.ఇలాంటి కుట్రలు చేసే చంద్రబాబును ప్రజలు క్షమించరని తెలిపారు.

పుంగనూరులో యాదవులు అంతా పెద్దిరెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు.

అక్కడ ఏం జరగలేదు… ఈ వివాదాన్ని పెద్దది చేయదు… డైరెక్టర్ బాబి షాకింగ్ కామెంట్స్!