వైరల్: అడిగిన పిజ్జా ఇవ్వనందుకు ఏకంగా ..?!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కి చెందిన దీపాలి త్యాగి అనే ఒక శాఖాహార యువతి మార్చి 19, 2019న అమెరికన్ పిజ్జా అవుట్‌లెట్‌ నుంచి శాకాహార పిజ్జా ఆర్డర్ చేశారు.

ఐతే ఆ రెస్టారెంటు ఆమెకు పొరపాటున మాంసాహార పిజ్జా డెలివరీ చేసింది.ఈ విషయం తెలియని దీపాలి మాంసాహార పిజ్జాలోని ఒక ముక్క తీసుకొని తిన్నారు.

ఐతే అది మాంసాహారంతో నింపిన పిజ్జా అని తెలిసిన ఆమె వెంటనే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి చెడామడా తిట్టారు.

అలాగే కన్స్యూమర్ కోర్ట్ ని ఆశ్రయించి తనకు కోటి రూపాయల నష్ట(పాప)పరిహారం చెల్లించాలని ఓ పిటిషన్ దాఖలు చేశారు.

తనకున్న మత విశ్వాసాలు, తాను విన్న మత బోధనలు, కుటుంబ సంప్రదాయాలు, తన మనస్సాక్షితో తాను స్వచ్చమైన శాకాహారిగా మారానని కానీ పిజ్జా కంపెనీ తమ నిర్లక్ష్యంతో ఆమె తనని మాంసాహారిగా మార్చారని పిటిషన్ లో పేర్కొన్నారు.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.హోలీ పండుగ సందర్భంగా దీపాలి పిజ్జా ఆర్డర్ చేశారు.

పండుగ ఘనంగా జరుపుకున్న తర్వాత ఆమె బాగా అలిసిపోయి ఉన్నారు.అప్పటికే పిజ్జా డెలివరీ 30 నిమిషాలు లేట్ అయింది.

దీంతో ఆమెలో అసహనం పెరిగిపోయింది.ఐతే 30 నిమిషాల ఆలస్యంగా డెలివరీ అయిన పిజ్జాని వేస్ట్ చేయడం ఎందుకని ఆమె ఒక ముక్క తిన్నారు.

అప్పుడే అది మాంసాహార పిజ్జా అని ఆమెకి తెలిసింది.వెంటనే కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఈ విషయం తెలియజేశారు.

ఐతే నాలుగు రోజుల తర్వాత అనగా మార్చి 24వ తేదీన పిజ్జా అవుట్‌లెట్‌ డిస్టిక్ మేనేజర్ దీపాలి కి ఫోన్ చేసి ఫ్యామిలీ మొత్తానికి ఫ్రీగా పిజ్జాలు డెలివరీ చేస్తామని ఆఫర్ ఇచ్చారు.

కానీ తన మతపరమైన సంప్రదాయాలను సర్వ నాశనం చేసి తనను శాశ్వతంగా మానసిక వేదనకు గురి చేయడమనేది.

నాలుగు పిజ్జాలు ఇచ్చి చేతులు దులిపేసుకునే చిన్న కేసు ఏమీ కాదని ఆమె డిస్టిక్ మేనేజర్ కి చెప్పారు.

మాంసం తినడం తో తాను అపవిత్రురాలయ్యానని మళ్ళీ పవిత్రమైన మహిళను కావాలంటే చాలా పూజలు చేయించుకోవాల్సి ఉందని (ఇక్కడ పూజలు అంటే.

పాప పరిహారంగా పూజలు చేస్తారే.అలా అన్నమాట.

) ఆ పూజలకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని అందుకే కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

మరి వినియోగదారుల న్యాయ స్థానం ఈ కేసులో ఎటువంటి తీర్పు వెలువరించనుందో చూడాలి.

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్!