వేపతో ఈ రోగాలకి చెక్ పెట్టండి
TeluguStop.com
భారతదేశంలో వేప చెట్టుకు ఉన్న ప్రాముఖ్యత మరే చెట్టుకి లేదు ,భారతీయులు వేపచేట్టుని లక్ష్మీ దేవిగా పూజిస్తారు.
తెలుగు సంవత్సరాదిలో ఉగాది రోజున వేపచేట్టుకి మొక్కి వాటిపూలనుండి తీయబడిన రేకులతో వేపపువ్వు పచ్చడి చేసుకుని తినడం తరతరాల నుండీ మనం పాటిస్తున్న ఆచారం.
వేపచెట్టు వేరు, బెరడు, పత్రములు, పూవులు, విత్తనాలు, అన్నికూడ ఔషద బలాన్ని ఇస్తున్నప్పటికీ,.
ఆకులు అధిక అధిక ఔషద ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి.చర్మవ్యాధుల నివారణకు వేప పెట్టింది పేరు.
వేప బ్యాక్టిరియాను, వైరస్ నశింపజేస్తుంది ఆయుర్వేద మందులలో సైతం వేప వినియోగిస్తారు.వేపనూనెను ఎక్కువగా చర్మవ్యాధులకు వాడుతారు.
పళ్లకు వేప పుల్లలను వాడటం వల్ల చిగుళ్లు గట్టిపడి నోటి దర్వాసన పోతుంది.
వేపనూనె , నీరుడు విత్తుల తైలం రెండు రెండు వందల గ్రాముల చప్పున తీసుకుని అందులో 25 గ్రాముల వంట కర్పూరం తీసుకుని వేడిచేయాలి ఇలా వచ్చిన తైలాన్ని అనేక చర్మ వ్యాదులలో ఉపయోగిస్తారు.
అంతే కాదు కుష్టువ్యాధి గ్రస్తులకి కూడా ఈ తైలాన్ని రాస్తే మంచి ఉపసమనం కలుగుతుంది.
ప్రతీ రోజు ఉదయం ఐదు వేపాకులు,ఐదు మిరియాలు కలిపి మింగుతూ ఉంటే సీజనల్ గా వచ్చే అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
డెంగ్యు ,చికిన్ గున్యా ,వంటి వైరస్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.వేపాకు బూడిదని పుళ్ళపై రాసుకుంటే త్వరగా మానిపోతాయి .
అంతేకాదు సోరియాసిస్ ని సైతం కంట్రోల్ చేయగల శక్తి కలది వేప.
వీల్ చైర్ కోసం 10 వేల ఫీజు.. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఎన్ఆర్ఐకి చేదు అనుభవం