వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించిన ఎస్పీ.

సూర్యాపేట జిల్లా: దర్యాప్తు అధికారులకు,స్టేషన్ హౌస్ అధికారులకు, టెక్ టీమ్ సిబ్బందికి ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ పై గురువారం జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

స్టేషన్ హౌజ్ ఆఫీసర్ బాధ్యతలు,కేసుల దర్యాప్తు, కేసుల చేధనకు అవసరమయ్యే మెళకువలు పలు అంశాలపై ఎస్పీ సూచనలు,సలహాలు అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పోలీసు అమలు చేస్తున్న పోలీస్ ఫంక్షనల్ వర్టికల్ (పని విభాగాలు) నిర్వహణతో ప్రజా సేవలు వేగంగా అందిస్తున్నామన్నారు.

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు పని విభగాలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నైపుణ్యం పెంచుకుని బాగా పని చేయాలని అన్నారు.స్టేషన్లో కేసుల నమోదు,ఫిర్యాదుల నిర్వహణ,కేసుల దర్యాప్తు, ఎన్ఫోర్స్మెంట్,పోలీసు సేవల అమలు ఇలా అన్ని విభాగాలను సమర్థవంతంగా నిర్వర్తించి వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో సిసి కెమెరాలు పెంచి,గతంలో ఏర్పాటు చేసిన కెమెరాలు అధునికరించాలని, అత్యంత నాణ్యమైన కెమెరాలు ఏర్పాటు చేసి, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని ఆదేశించారు.

కేసులు పెండింగ్ ఉండకుండా పని చేయాలని,కేసుల్లో దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలని,ప్రజలతో మమేకమై పని చేయాలని కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు ఎస్ఐలు, ఐఓలు టెక్ టీమ్ సిబ్బంది,ఐటి కోర్ ఎస్ఐ శివ, సిబ్బంది పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కుదేలవుతున్నా కేటీఆర్ కు ఏం పట్టదా ?