విద్యుత్ స్తంభాల ప్రారంభోత్సవం

!--moreనల్గొండ జిల్లా: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కట్టంగూర్ మండల కేంద్రం గాంధీ నగర్ కాలనీలో నూతన విద్యుత్ స్తంభాలను జెడ్పీటీసీ తరాల బలరామ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీనగర్ కాలనీ విద్యుత్ స్తంభాలు లేక ఇబ్బందులు పడుతూ కాలనీ వాసులు నకరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యకి విన్నవించగా పై అధికారులతో మాట్లాడి విద్యుత్ స్తంభాలను మంజూరు చేయించడం జరిగిందన్నారు.

ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊటుకూరి ఏడుకొండలు,ఉపాధ్యక్షులు బోల్లేద్దు యాదయ్య,ఉప సర్పంచ్ అంతటి శ్రీనివాస్,వార్డ్ నెంబర్స్ అంతటి నాగమణి నాగేష్,రెడ్డిపల్లి మనోహర్,మునుగోటి ఉత్తరయ్య,హుస్సేన్, షాలమంద గిరి తదితరులు పాల్గొన్నారు.