విండీస్ బ్యాటర్లపై చెలరేగిన అశ్విన్.. ఖాతాలో ఏకంగా ఆరు సరికొత్త రికార్డులు..!

భారత్-వెస్టిండీస్ ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ చరిత్రలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని అరుదైన ఘనవిజయం సాధించింది.

డొమినికా టెస్టులో వెస్టిండీస్ పై భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.టెస్టు మ్యాచ్ ను మూడు రోజుల్లోనే ముగించి, 141 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్ లోనే భారత జట్టు ఐదు వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

"""/" / రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు కేవలం 130 పరుగులకే ఆల్ అవుట్ అయింది.

విండీస్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్ చేర్చడంలో రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin)కీలక పాత్ర పోషించాడు.

రవిచంద్రన్ అశ్విన్ మొదటి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు రెండవ ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి పలు రికార్డులు బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.

అవి ఏమిటో చూద్దాం. """/" / వెస్టిండీస్ జట్టుపై ఆరుసార్లు అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు.

ఈ విషయంలో హర్భజన్ సింగ్( Harbhajan Singh ) రికార్డును బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదవ సారి టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును సమం చేశాడు.

తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్లో 10 వికెట్లు తీస్తే ఈ ఘనత సాధించిన భారత తొలి బౌలర్ గా సరికొత్త రికార్డు సృష్టించబడుతుంది.

వెస్టిండీస్( West Indies ) తో ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోను ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో నిలిచాడు.

రవిచంద్రన్ అశ్విన్ 23వసారి టెస్ట్ మ్యాచ్లో చివరి వికెట్ తీసి, ప్రపంచ రికార్డు సృష్టించిన షేన్ వార్న్ రికార్డులు బద్దలు కొట్టాడు.

అశ్విన్ తన కెరీర్లో విదేశీ గడ్డపై 131 పరుగులు ఇచ్చి 12 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

ఒకే ఇన్నింగ్స్ లో 71 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టడం విదేశీ గడ్డపై అతని మరో అత్యుత్తమ ప్రదర్శన.

ఫ్యామిలీతో వెకేషన్ లో చిల్ అవుతున్న బన్నీ… ఫోటోలు వైరల్!