వర్మను తన్నాల్సి వస్తుందా?
TeluguStop.com
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనాత్మకంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
గత పుష్కర కాలంగా వర్మకు సరైన సక్సెస్ లేదు.అయినా కూడా వర్మను నమ్మి ఎంతో మంది సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.
శ్రద్ద పెట్టి వర్మ సినిమా తీస్తే ఖచ్చితంగా అద్బుతాలు ఆవిష్కారం అవుతాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్, టాలీవుడ్‌లో అద్బుతమైన సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు వర్మ తాజాగా నాగార్జున హీరోగా ‘ఆఫీసర్’ అనే చిత్రాన్ని చేశాడు.
ఈ చిత్రం కథ చెప్పినప్పుడు నాగార్జునతో వర్మ చెప్పిన మాట ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
నాగ్‌తో వర్మ చెప్పిన ఆ మాట ‘ఆఫీసర్’ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది.
తాజాగా ‘ఆఫీసర్’ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ ‘ఆఫీసర్’ చిత్రం ఒక మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు.
తప్పకుండా ఈ సినిమా శివ రేంజ్‌లో ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశాడు.ఈ చిత్రం కథ చెప్పే సమయంలో వర్మ తనతో ఒక మాట అన్నాడు.
ఆ మాట ఏంటీ అంటే తాను చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించకుంటే తన్నండి పడతాను అన్నాడు.
కాని సినిమాను వర్మ ఎలా అయితే నరేట్ చేశాడో అలాగే తెరకెక్కించాడు.అందుకే ఇప్పుడు వర్మను నేను తన్నడం లేదు అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.
!--nextpage
నాగార్జున, వర్మల కాంబినేషన్‌లో గతంలో మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంత చేసుకున్నాయి.
తాజాగా ఈ చిత్రం కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు.
తాజాగా నాగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ అంచనాలను పెంచుతున్నాయి.కాని కొందరు మాత్రం వర్మ ఈమద్య చేసిన చిత్రాల మాదిరిగానే ‘ఆఫీసర్’ ఉంటుందని అంటున్నారు.
వర్మలో ఆ సత్తా ప్రస్తుతం లేదని, షూటింగ్ పూర్తి అయిన తర్వాత వర్మను నాగార్జున తన్నలేదు.
కాని సినిమా విడుదల తర్వాత వర్మను నాగార్జున తన్నడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో జోకులు పేళుతున్నాయి.
రామ్ గోపాల్ వర్మ గత కొన్ని సంవత్సరాలుగా చేసిన అతి పెద్ద సినిమా ఇదే కావడం విశేషం.
నాగార్జునకు మరియు వర్మకు ఈ చిత్రం సక్సెస్ చాలా అవసరం.అందుకే ఈ చిత్రంను వారిద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
నాగార్జున పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో వర్మ హై టెక్నాలజీని వాడటంతో పాటు, అద్బుతమైన కెమెరా పనితనంతో తెరకెక్కించాడు అంటూ ప్రశంసించాడు.
మరి వర్మపై నాగార్జున పెట్టుకున్న నమ్మకం నిలిచేనా లేదా వమ్ము అయ్యేనా చూడాలి.
‘భైరవం’ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ పాన్ ఇండియా హీరోగా ప్రూవ్ చేసుకుంటాడా..?