లో బ్లడ్ షుగర్‌తో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!
TeluguStop.com
మధుమేహం వ్యాధి ఉన్న వారిలోనే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ తప్పుతాయని భావిస్తుంటారు.
కానీ, మధుమేహం లేక పోయినా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతుంటాయి.ముఖ్యంగా చాలా మంది లో బ్లడ్ షుగర్‌తో తరచూ ఇబ్బంది పడుతుంటారు.
ఆహారపు అలవాట్లు, అధికంగా వ్యాయామాలు చేయడం, ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం, మద్యపానం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతూ ఉంటాయి.
దీనినే హైపోగ్లైసీమియా అంటారు.రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గి పోవడం కారణంగా తల నొప్పి, మైకం, విపరీతమైన చెమటలు, అధిక ఆకలి, నీరసం, అలసట, చూపు మందగించడం, మూర్ఛ, స్పృహ కోల్పోవడం, వణుకు వంటి ఎన్నో సమస్యలు చికాకు పుట్టిస్తుంటాయి.
ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.అందుకే లో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను ఖచ్చితంగా అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది.
అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.మరి అవేంటో లేట్ చేయకుండా ఓ చూపు చూసేయండి.
"""/" /
లో బ్లడ్ షుగర్ సమస్యను నివారించడంలో ఆల్ బుకారా పండ్లు గ్రేట్‌గా హెల్ప్ చేస్తాయి.
వీటిని రెగ్యులర్‌గా తగిన మోతాదులో తీసుకుంటే గనుక రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లోకి తెస్తాయి.
అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్‌ను ఆరోగ్యకరమైన పరిధిలోకి తేవడంలో కిస్ మిస్ కూడా సూపర్‌గా సహాయపడతాయి.
అందు వల్ల, కిస్ మిస్‌ను డైరెక్ట్‌గా తీసుకోవడం లేదా వాటర్‌లో రాత్రంతా నాన బెట్టుకుని తీసుకోవడం చేయాలి.
బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోతున్నాయి అనిపిస్తున్నప్పుడు వెంటనే ఒక అరటి పండు తీసుకోవాలి.
తద్వారా అరటి పండులో ఉండే కొన్ని పోషకాలు బ్లడ్ షుగర్ స్థాయిల్ని నార్మల్ కు తీసుకువచ్చేస్తాయి.
ఇక ఇవే కాకుండా ఖర్జూరాలు, ద్రాక్ష పండ్లు, తేనె వంటివి తీసుకోవడం ద్వారా కూడా లో బ్లడ్ షుగర్ సమస్యను నివారించుకోవచ్చు.
అర్ధరాత్రి పోలీసులను పిలిపించిన మందుబాబు.. ఏం కంప్లైంట్ ఇచ్చాడో తెలిస్తే నవ్వేనవ్వు..