లోక్ సభ స్పీకర్ కుర్చీలో వైసీపీ ఎంపీ
TeluguStop.com

వైసీపీ యువనేత, రాజంపేట లోక్ సభ సభ్యుడు మిథున్ రెడ్డి లోక్ సభ స్పీకర్ కుర్చీలో కనిపించారు.


సమావేశాల్లో భాగంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేరు.దీంతో సభను నడిపించే అవకాశం ఎంపీ మిథున్ రెడ్డికి దక్కింది.


ఈ సందర్భంగా లోక్ సభను కాసేపు నడిపించే అవకాశం తనకు దక్కడం గర్వంగా ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వీరిద్దరికీ మాత్రమే ఈ కుర్చీలో కూర్చొనే అవకాశం ఉంటుంది.
వారిద్దరూ అందుబాటులో లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ జాబితాలోని ఆయా సభ్యులు కుర్చీలో కూర్చుని సభను నడిపిస్తారు.
పార్లమెంటరీ వ్యవహారాలపై సమగ్ర అవగాహన కలిగేలా ఆయా పార్టీల సభ్యులకు ఈ ఛాన్స్ వస్తుంది.
2019 సార్వత్రిక ఎన్నికలు అనంతరం ఆయా పార్టీలకు చెందిన పలువురు ఎంపీలను లోక్ సభ సెక్రటేరియట్ ప్యానెల్ స్పీకర్లుగా ఎంపిక చేసింది.
ఈ జాబితాలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు.
ఖాళీ కడుపుతో కాఫీ తాగితే ఏం అవుతుందో తెలుసా?