లిఫ్టులో ఆమెకు ముద్దు పెట్ట‌బోయాడు.. వెనుక‌నున్న వ్య‌క్తిని చూసి షాక‌య్యాడు

ఒంటరిగా అమ్మాయి క‌నిపిస్తే చాలు.కొంద‌రు కుర్రాళ్లు అసభ్యకర చేష్ట‌ల‌కు పాల్ప‌డుతుంటారు.

ఇలాంటి ఉదంతాలు మ‌నం చాలానే చూసివుంటాం.ఇలాంటి ఘ‌ట‌నే ఓ అమ్మాయికి లిఫ్ట్‌లో ఎదురైంది.

ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసిన ఓ కుర్రాడు బలవంతంగా ఆమెను ముద్దు పెట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

అయితే అమ్మాయి అతనిని వెనక్కి నెట్టేసింది.ఇంత‌లో లిఫ్ట్ తెరుచుకుంది.

అక్క‌డ ఆ అమ్మాయి తండ్రి ఉన్నాడు.ఈ ఘటన రష్యాలోని సుర్గుట్ నగరంలో చోటు చేసుకుంది.

డైలీ మెయిల్ కథనం ప్రకారం, స్థానికంగా ఉన్న‌ ఒక ఫ్లాట్‌లో 15 ఏళ్ల యువ‌తి లిఫ్ట్‌లో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆమె లిఫ్టులో ఉన్న స‌మ‌యంలో లిఫ్ట్‌లోకి 27 ఏళ్ల కుర్రాడు వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాడు.

అయితే ఆమె లిఫ్ట్‌ మూసే ప్ర‌య‌త్నం చేయ‌డంతో ఆ కుర్రాడు కోపంతో అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఆమెకు బలవంతంగా ముద్దుపెట్టే ప్ర‌య‌త్నం చేశాడు.దీంతో ఆ యువ‌తి అతడిని వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించినా ఫ‌లితం లేక‌పోయింది.

అయితే ఇంత‌లో ఒక్కసారిగా లిఫ్ట్‌ తెరుచుకోవడంతో బాలిక తండ్రి లిఫ్ట్ ఎదుట ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు.

జ‌రిగిన ఘ‌ట‌న‌ను గ్ర‌హించిన‌ ఆమె తండ్రి ఆ యువకునిపై విరుచుకుపడ్డాడు.ఆ కుర్రాడి మెడ పట్టుకుని, లిఫ్ట్ నుంచి బయటకు లాగాడు.

అప్ప‌టికే అక్క‌డికి జ‌నం వ‌చ్చారు.ఆ అమ్మాయి తండ్రి ఆ కుర్రాడు చేసిన పనిని అక్క‌డున్న‌వారికి వివరించాడు.

ఇంతలో ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని, ఆ కుర్రాడిని అరెస్టు చేశారు.

కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు ప్రారంభించారు.

కేరళ టూరిజం గురించి లండన్‌లో ప్రచారం.. ఎలాగంటే..