రైతాంగ హామీల అమలులో కేంద్రం వైఫల్యం చెందింది: తీగల సాగర్
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: ఏడాది పాటు దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని చేసిన పోరాట ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని
ఎంవీఎన్ భవన్ లో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కే ఎం) జిల్లా సదస్సుకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లడుతూ రైతులకు బడ్జెట్ లో నిధులు పెంచాలని,విత్తనాలు, ఎరువులు,విద్యుత్ వంటి వాటికి సబ్సిడీలు పెంచాలని,రైతు పండించిన అన్ని రకాల పంటకు ఎం.
ఎస్ స్వామినాథన్ సిఫారసు ప్రకారం పెట్టుబడికి 50 శాతం కలిపి మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టబద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్శ పద్మ మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న ఫసల్ బీమా యోజన పథకాన్ని సవరించి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకురావాలని కోరారు.
వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు, వరదలు పంట సంబంధిత వ్యాధుల వలన పంట పొలాలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు అన్ని పంటలకు బీమా పథకాన్ని అందించాలన్నారు.
అన్ని వ్యవసాయ కుటుంబాలను అప్పుల ఊబి నుండి విముక్తి చేయడానికి సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అనంతరం
అఖిలభారత రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కోటేశ్వరరావు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన రైతుల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రైతాంగానికి ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలన్నారు.
కార్మికులు నాలుగు లేబర్ కోడ్ రద్దు చేసుకొని తమ హక్కులను సాధించుకునేందుకు ఉద్యమించాలన్నారు.
వ్యవసాయ కార్మికులకు సమగ్ర కేంద్ర శాసన చట్టం తీసుకువచ్చి వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని అన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ఈ సదస్సు ప్రారంభానికి ముందు వక్తలను అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సదస్సుకు అధ్యక్ష వర్గంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బురి శ్రీరాములు,అఖిల భారత రైతుకులి సంఘం జిల్లా అధ్యక్షులు పోటు లక్ష్మయ్య,తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి శ్రీనివాస్ వ్యవహరించారు.
అనంతరం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీని ఎన్నికున్నారు.కన్వీనర్లుగా దండ వెంకటరెడ్డి,దొడ్డ వెంకటయ్య,బొడ్డు శంకర్, పేర్ల నాగయ్య,బుద్ధ సత్యనారాయణ,నల్లెడ మాధవరెడ్డి,మట్టిపెళ్లి సైదులుతో పాటు కమిటీ సభ్యులుగా మల్లు నాగార్జున రెడ్డి,బుర్రి శ్రీరాములు,పోటు లక్ష్మయ్య,అలుగుబెల్లి వెంకటరామిరెడ్డి,కొప్పోజు సూర్యనారాయణ, కంబాలపల్లి శీను,కొప్పుల రజిత,మూరగుండ్ల లక్ష్మయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు మల్లు నాగార్జున రెడ్డి,వివిధ రైతు కూలీ సంఘాల నాయకులు దండా వెంకటరెడ్డి,దొడ్డ వెంకటయ్య,బొడ్డు శంకర్, నల్లెడ మాధవరెడ్డి,పేర్ల నాగయ్య,మూరగుండ్ల లక్ష్మయ్య,బుద్ధ సత్యనారాయణ,మట్టిపెళ్లి సైదులు,కందాల శంకర్ రెడ్డి,అలుగుబెల్లి వెంకటరామిరెడ్డి,కొప్పుల రజిత,కొప్పోజు సూర్యనారాయణ,దేవరం వెంకటరెడ్డి,బెల్లంకొండ సత్యనారాయణ,మందడి రాంరెడ్డి,దశరథ, పోలబోయిన కిరణ్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రియదర్శి కోర్ట్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయిందా.. ఆరోజు నుంచి స్ట్రీమింగ్ కానుందా?